हैदराबाद: शादी के दो दिन बाद ही सड़क दुर्घटना में विवाहित जोड़े की मौत हो गई। इसके चलते दोनों के परिवारों में मातम छा गया। श्रीकाकुलम (आंध्र प्रदेश) जिले के इच्चापुरम शहर के बेल्लुपडा कॉलोनी में रहने वाले गवलपु वेणु उर्फ सिम्हाचलम (26) की शादी इसी महीने की 10 तारीख को ब्रह्मपुरम की सुभद्रा उर्फ प्रवलिका (23) से हुई थी।
12 फरवरी को इच्चापुरम में स्वागत समारोह का आयोजन किया गया था। दोनों परिवारों की तरफ से इस डिनर में रिश्तेदार और दोस्त शामिल हुए और कपल को आशीर्वाद दिया। अगले दिन दंपति दोपहिया वाहन से ओडिशा में अपने ससुराल जा रहे थे। इसी दौरान गोलन्तरा पुलिस थाना क्षेत्र में एक ट्रैक्टर ने उन्हें टक्कर मार दी। नतीजतन, सुभद्रा की मौके पर ही मौत हो गई और उसका पति सिम्हाचलम गंभीर रूप से घायल हो गया। उसे तुरंत ब्रह्मपुरा अस्पताल ले जाया गया, जहां इलाज के दौरान उसकी मौत हो गई।
दूसरीओर, विजयवाड़ा गुड़वल्ली नेशनल हाईवे पर मंगलवार को हुए सड़क हादसे में दो लोगों की मौत हो गई। कार और दुपहिया वाहन की टक्कर में एलुरु जिले के शेख रिजवान और शेख रफी की मौके पर मौत हो गई। पुलिस मामले की छानबीन कर रही है। (एजेंसियां)
రోడ్డు ప్రమాదంలో కొత్త దంపతులు మృతి చెందారు
హైదరాబాద్ : ఎన్నో ఆశలతో ఒక్కటైన ఆ జంట పెళ్లయిన రెండురోజులకే ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వారి రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్) జిల్లా ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడ కాలనీలో ఉంటున్న గవలపు వేణు అలియాస్ సింహాచలం (26), బ్రహ్మపురానికి చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక(23)తో ఈనెల 10న వివాహం జరిగింది.
12న ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇరు కుటుంబాల తరుఫున బంధు, మిత్రులు హాజరై దంపతులను ఆశీర్వదించారు. మరుసటి రోజు ఈ దంపతులు ఒడిస్సాలోని అత్తగారింటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గొలంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో సుభద్ర అక్కడికక్కడే మృతి చెందగా భర్త సింహాచలానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని బ్రహ్మపుర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
విజయవాడ గూడవల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మరోవైపు మంగళవారం విజయవాడ గూడవల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు, ద్విచక్రవాహనం ఢీ కొనగా ఏలూరు జిల్లాకు చెందిన షేక్ రిజ్వాన్, షేక్ రఫీ దుర్మరణం చెందారు. (ఏజెన్సీలు)