హైదరాబాద్ : .బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేసిన కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్)నేత కుమార స్వామి. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్ యే అన్న కుమారస్వామి.
రాయచూర్ లో జరిగిన పంచరత్న యాత్ర లో నారాయణ పేట బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న కుమార స్వామి. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందన్న కుమార స్వామి.
మిషన్ భగీరథ పథకం తో తెలంగాణ లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తోందన్న కుమార స్వామి. కర్ణాటక లో తాము అధికారం లోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తి తో పథకాలు అమలు చేస్తామన్న జేడీ (ఎస్)నేత. కాంగ్రెస్, బీజేపీ లు కర్ణాటక అభివృద్ధిని వెనక్కు నెట్టాయని ఆరోపించిన కుమార స్వామి.