हैदराबाद: तेलंगाना के राजन्ना सिरिसिला जिले के एल्लारेड्डीपेट में एक स्कूल बस दुर्घटनाग्रस्त हो गई। छात्रों को ले जा रही स्कूल बस को पीछे से आरटीसी बस ने टक्कर मार दी। इस हादसे में 15 छात्र गंभीर रूप से घायल हो गए। चोट के दर्द से छात्र बिलख पड़े। घायल छात्रों को स्थानीय अस्पताल में भर्ती कराया गया है और उनका इलाज चल रहा है।
कलेक्टर ने डीईओ से सड़क हादसे के बारे में जानकारी ली। हादसे में घायल बच्चों को बेहतर इलाज मुहैया कराने का आदेश दिया। बच्चों के एक्सीडेंट का पता चलने पर परिजन अस्पताल पहुंचे हैं।
विज्ञान इंग्लिश मीडियम स्कूल की बस अलमासपुर और राजन्नापेट छात्रों को लेकर मंगलवार सुबह सिरिसिल्ला लौट रही थी। इसी क्रम में एल्लारेड्डीपेट के दूसरे बाइपास कॉर्नर पर एक टर्निंग प्वाइंट आता है। इसी दौरान आरटीसी बस ने स्कूल बस को पीछे से जोरदार टक्कर मार दी।
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ) ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విద్యార్థులను తీసుకొని వెళ్తున్న స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల నొప్పితో విద్యార్థులు బోరున విలపించారు. గాయపడ్డ విద్యార్థులను హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఈ ప్రమాదం గురించి డీఈవోను కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. తమ పిల్లలకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తల్లిందండ్రులు ఆసుపత్రికి పరుగులు తీశారు.
విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు మంగళవారం ఉదయం అల్మాస్ పూర్, రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరిగి సిరిసిల్లకు వస్తుంది. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మూలమలుపు ఉంది. అయితే అదే సమయంలో ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సు వెనకాల నుండి బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు బస్సు కుదుపులకు లోను కాగా విద్యార్థులు ఒకరిపై మరొకరు పడ్డారు. మరికొంతమంది బస్సులో కడ్డీలకు, సీట్లకు తాకడంతో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయాలబారిన పడ్డ విద్యార్థులు నొప్పికి తట్టుకోలేక బోరున ఏడ్చారు.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్కూల్ యజమాని ఎండి లతీఫ్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ విద్యార్థులను స్థానిక అశ్విని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు అంత సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తుంది.
ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఢికొట్టడంతో ప్రమాదం జరగగా ఆ సమయంలో ఒకవేళ స్కూల్ బస్సు బోల్తా పడితే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సు అతి వేగంతో వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. (ఏజెన్సీలు)