हैदराबाद : अभिनेत्री जमुना का अंतिम संस्कार प्रशंसकों के अश्रुपूर्ण नयनों के बीच संपन्न हुआ। उनका अंतिम संस्कार फिल्म नगर स्थित महाप्रस्थान में किया गया। जमुना की बेटी श्रवंती ने उनका अंतिम संस्कार किया।
हिंदू परंपराओं का पालन करते हुए उनकी मां की चिता को मुखाग्नि दी गई। जमुना का एक बेटा भी है। ज्ञातव्य है कि विदेश में रहने के कारण वह नहीं आ सके। उनकी बेटी श्रवंती ने दाह संस्कार किया।
आपको बता दें कि पिछले कुछ दिनों से स्वास्थ्य संबंधी दिक्कतों से जूझ रही जमुना ने शुक्रवार को अपने आवास पर अंतिम सांस ली। 1936 में जन्मी जमुना ने तेलुगु, कन्नड़, तमिल और हिंदी भाषाओं की लगभग 198 फिल्मों में काम किया।
संबंधित खबर :
ముగిసిన జమున అంత్యక్రియలు
హైదరాబాద్ : సీని నటి జమున అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.
హిందూ సంప్రదాయాలను అనుకరిస్తూ ఆమె తల్లి చితికి నిప్పు అంటించారు. జమునకు కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఆయన విదేశాల్లో ఉండటంతో రావాడానికి ఆలస్యం అవుతుందని తెలియడంతో కుమార్తె స్రవంతి దహన సంస్కారాలు నిర్వహించారు.
సీనియర్ నటి జమున (Jamuna) (86) జనవరి 27న కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా ఆమె అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. జమున కుమారుడు విదేశాల్లో నివసిస్తున్నారు. ఆయన రాక ఆలస్యం కానుండటంతో.. కుమార్తె స్రవంతిరావు తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ‘మా’ అసోసియేషన్ సభ్యులు మాదాల రవి, కరాటే కల్యాణి, జీవిత తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంత్రి రోజా కూడా చివరి క్షణంలో వచ్చి నివాళులు అర్పించారు.
జమున 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించారు. 1953లో ‘పుట్టిల్లు’ సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. సత్యభామ పాత్ర ఆమెకు ఎంతగానో గుర్తింపును తీసుకువచ్చింది. ‘మిస్సమ్మ’ జమున కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. ‘సంతోషం’, ‘మిస్సమ్మ’, ‘తెనాలి రామకృష్ణుడు’, ‘దొంగ రాముడు’, ‘బంగారు పాప’, ‘భూ కైలాస్’, ‘భాగ్య రేఖ’, ‘గుండమ్మకథ’ తోపాటు పలు హిట్ చిత్రాల్లో నటించారు. 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుపొందారు. (ఏజెన్సీలు)