హైదరాబాద్ : జగిత్యాల జిల్లా పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా వెల్గటూర్ మండలంలోని కిషన్ రావు పేట స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం లో ముక్కట్రావు పేరు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మరణించగా బుధవారం కరీంనగర్ లో సివిల్ ఆసుపత్రిలో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్.
అదే ప్రమాదంలో గాయపడ్డ కిషన్ రావు పేట గ్రామానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్, కుమ్మరి పెల్లి గ్రామానికి చెందిన జక్కుల అంజి, ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పరామర్శించి, డాక్టర్ తో వారి ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆదేశించారు, మంత్రి గారి వెంట మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, PACS ఛైర్మన్ గూడ రాంరెడ్డి గారు ఉన్నారు.