हैदराबाद: निर्देशक एसएस राजामौली की फिल्म ‘आरआरआर’ प्रतिष्ठित ऑस्कर पुरस्कार की दौड़ में शामिल हो गई है। 95वें अकादमी पुरस्कार के लिए नामांकित फिल्मों की सूची मंगलवार को घोषित की गई।
इस सूची में फिल्म ‘आरआरआर’ का गाना ‘नाटू नाटू’ बेस्ट ओरिजिनल सॉन्ग के लिए नॉमिनेट हुआ था। मालूम हो कि हाल ही में कैलिफोर्निया में हुए गोल्डन ग्लोब अवॉर्ड्स में आरआरआर फिल्म के गाने ‘नाटू नाटू’ ने ‘बेस्ट ओरिजिनल सॉन्ग कैटेगरी’ में अवॉर्ड जीता था।
दो दिन पहले जापान के 46वें एकेडमी अवॉर्ड्स में आरआरआर ने गोल्डन ग्लोब अवॉर्ड ही नहीं ‘आउटस्टैंडिंग फॉरेन फिल्म’ कैटेगरी में भी अवॉर्ड जीता था। अवतार-2, टॉपगन: मेवरिक जैसी बड़ी फिल्मों को पीछे धकेलते हुए आरआरआर मूवी आउटस्टैंडिंग फॉरेन फिल्म कैटेगरी में अवॉर्ड मिलना इसकी खूबी रही है।
This year's Original Song nominees are music to our ears. #Oscars #Oscars95 pic.twitter.com/peKQmFD9Uh
— The Academy (@TheAcademy) January 24, 2023
ऑस्कर नॉमिनेशन की रेस में भारत की कुल 10 फिल्में रहीं है। ऋषभ शेट्टी स्टारर कांटारा बेस्ट पिक्चर और बेस्ट एक्टर कैटेगरी में ऑस्कर नॉमिनेशन की रेस में थी, लेकिन उसे निराशा हाथ लगी। ऑस्कर अवॉर्ड्स का आयोजन 12 मार्च को लॉस एंजिलिस के डॉल्बी थिएटर में होगा।
ऑस्कर नामांकन की दौड़ में शामिल भारतीय फिल्मों में आरआरआर, कांतारा, रॉकेट्री, चलो शो, गंगूबाई काठियावाड़ी, विक्रांत रोना, द नंबी इफेक्ट, मी वसंतराव, तुज्या साठी कही है, इराविन निलाल शामिल हैं।
Entertainment: ఆస్కార్‌కు నాటు నాటు సాంగ్ నామినేట్, కానీ…
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు రేసులో నిలిచింది. 95వ అస్కార్ అవార్డు నామినేషన్స్‌లో నిలిచిన సినిమాల జాబితాని మంగళవారం ప్రకటించారు.
ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ అయ్యింది. ఇటీవల కాలిఫోర్నియా వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాటకి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ’లో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఒక్కటే కాదు రెండు రోజుల క్రితం జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్‌లో ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరిలోనూ అవార్డుని ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. అవతార్- 2, టాప్‌గన్: మావెరిక్ లాంటి భారీ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ఆర్ఆర్ఆర్ మూవీ అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డుని దక్కించుకోవడం విశేషం.
ఆస్కార్ నామినేషన్ రేసులో భారత్‌కి చెందిన మొత్తం 10 సినిమాలు నిలిచాయి. రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్ రేసులో నిలిచినా నిరాశే ఎదురైంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది.
ఆస్కార్ నామినేషన్స్ రేసులో ఆర్ఆర్ఆర్, కాంతార, రాకెట్రీ, ఛల్లో షో, గంగూభాయి కతియావాడి, విక్రాంత్ రోణ, ది నంబీ ఎఫెక్ట్, మి వసంతరావ్, తుజ్యా సాథీ కహీ హై, ఇరవిన్ నిళల్ నిలిచిన భారత సినిమాలు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగాల్లోనూ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ దర్శకుడు రాజమౌళి, నటులు జూ. ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ లకు తాజా ప్రకటనతో నిరాశకు గురయ్యారు.