हैदराबाद : सुकमा (छत्तीसगढ़) जिले में 11 जनवरी को किये गये हवाई हमले में माओवादी पीएलजीए सदस्य की मौत हो गई। दक्षिण जोनल ब्यूरो ऑफ माओवादी ने एक प्रेस नोट जारी कर बात कही है। मृतक महिला नक्सली की फोटो के साथ, जंगलों में किये गये हवाई हमले की निंदा करते हुए कुछ तस्वीरें भी जारी की है।
तेलंगाना और छत्तीसगढ़ पुलिस के समन्वय से ड्रोन और हेलीकॉप्टरों द्वारा मडकांगुडा, मेट्टागुडा, बोटेटुंग, सकीलेरे, माडपादुलाडे, कन्नेमरका, पोट्टेमंगम, बोट्टालंका, गांवों पर हवाई बमबारी की है। बयान में आगे कहा गया है कि सीमावर्ती इलाकों के एर्रापडु गांव में बम हमलों से दहशत का माहौल है। आदिवासी गांवों के लोग खेतों में काम करने से डर रहे हैं।
బాంబుల దాడిలో మహిళ నక్సలైట్ మృతి
Hyderabad: సుక్మా (చత్తీస్ గడ్) 11వ తేదీన వైమానిక దాడిలో తమ పి ఎల్ జి ఏ సభ్యుల్లో ఒక మహిళ కామ్రేడ్ మరణించినట్లు సౌత్ జోనల్ బ్యూరో ఆఫ్ సుక్మా మావోయిస్టు సమత పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారు. మరణించిన మహిళల నక్సలైట్ ఫోటోతో పాటు అడవుల్లో వైమానిక దాడులను ఖండిస్తూ మరికొన్ని ఫోటోలను విడుదల చేశారు.
ఛత్తీస్ఘడ్ బస్తర్ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాల దాడికి సంబంధించిన ఫొటోలను మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. తమపై డ్రోన్లతో దాడులు చేశారని ఆరోపిస్తూ ఫొటోలు రిలీజ్ చేసింది. ఈ నెల 11ను బ్లాక్ డేగా అభివర్ణించింది. భద్రతా బలగాల దాడిలో కామ్రేడ్ పొట్టం హుంగి మరణించినట్లు మావోయిస్ట్ పార్టీ ధృవీకరించింది. భద్రతా బలగాల దాడిలో ఆరుగురు మావోయిస్టు కమాండోలు గాయపడ్డారని చెప్పింది. బెటాలియన్ కమాండో హిడ్మా ప్రాణాలతోనే ఉన్నారని.. కేంద్ర ప్రభుత్వం హిడ్మా మరణించినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది.
సర్జికల్ స్ట్రైక్ పేరుతో వేలాది బాంబులను తమపై వేశారని.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎయిర్ ఫోర్స్ బలగాలు విచక్షణ రహితంగా దాడి చేశాయని మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. బస్తర్ ప్రాంతంలో ఇప్పటి వరకు మూడు సార్లు బాంబుల వర్షం కురిసిందని తెలిపింది. ఖనిజ సంపద కొల్లగొట్టడానికే బలగాలతో దాడులకు దిగుతున్నారని ఆరోపించింది. పోలీసుశాఖలో పేద, మధ్యతరగతి యువకులు చేరవద్దని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది.
మడ్కన్ గూడ, మెట్టగూడ, బొట్టేటంగ్, సకిలేర్, మడ్పడులడే, కన్నేమార్క, పొట్టేమంగుం, బొట్టలంక, గ్రామాలపై తెలంగాణ, చత్తీస్ ఘడ్ పోలీసుల సమన్వయంతో డ్రోన్లు మరియు హెలికాప్టర్ల ద్వారా వైమానిక బాంబు దాడి జరిగిందని మరియు సరిహద్దు ప్రాంతాల్లోని ఎర్రపాడు గ్రామంలో బాంబుల దాడులతో భయానిక వాతావరణం నెలకొందని గిరిజన గ్రామాల ప్రజలు పొలాల్లో పనిచేయడానికి భయపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. (Agencies)