हैदराबाद: कर्नाटक में हुए सड़क हादसे में तेलंगाना के एक डिप्टी तहसीलदार की मौत हो गई। अब्दुल्लापुरमेट मंडल के कोहेडा निवासी कोम्मिशेट्टी बालकृष्ण (47) इब्राहिमपट्टनम आरडीओ कार्यालय में उप तहसीलदार के रूप में कार्यरत हैं। बालकृष्ण अपने परिवार के सदस्यों के साथ कार में शिरडी गए थे। भगवान के दर्शन कर वह लौट आ रहे थे। बुधवार को कर्नाटक के बसवा कल्याणी क्षेत्र पहुंच गया।
अलसुबह सड़क पर दुर्घटना को देख बालकृष्ण ने अपनी कार को रोक दिया। इसी दौरान टायरों से लदी आ रही लॉरी डिवाइडर से टकराकर पलट गई। इसके चलते लॉरी में रखे टायर कार पर गये। इसके चलते दम घुटने से बालकृष्ण की मौके पर ही मौत हो गई। हादसे में उसकी पत्नी विजया, पुत्र भार्गव, पुत्री श्रीजा, भतीजा और कार चालक घायल हो गये। बालकृष्ण इब्राहिमपट्टनम, हयातनगर, याचाराम, कंदुकुर और जिलाधीश कार्यालयों में विभिन्न पदों पर काम किया।
बालकृष्ण के निधन पर राजस्व अधिकारियों व कर्मचारियों ने गहरा शोक व्यक्त किया है। उन्होंने कहा कि यह दुख की बात है कि हमेशा उनके साथ रहने वाले बालकृष्ण अब इस दुनिया में नहीं हैं। साथ ही बालकृष्ण के निधन से उनके पैतृक गांव अब्दुल्लापुरमेट मंडल कोहेड़ा पर शोक का साया छा गया है। विधायक मंचिरेड्डी किशन रेड्डी और बीआरएस के नेता क्यामा मल्लेश ने बालकृष्णा के मौत पर शोक व्यक्त किया।
రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి
హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ మృతి చెందారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడకు చెందిన కొమ్మిశెట్టి బాలకృష్ణ (47) ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ కారులో షిరిడీకి వెళ్లారు. దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం కర్ణాటకలోని బసవ కల్యాణినికి చేరుకున్నారు.
తెల్లవారుజామున రోడ్డుపై ప్రమాదం జరగడంతో బాలకృష్ణ కారును ఆపారు. ఇంతలో టైర్ల లోడుతో వస్తున్న లారీ డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. లారీలోని టైర్లు కారుపై పడ్డాయి. దీంతో బాలకృష్ణ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. భార్య విజయ, కొడుకు భార్గవ్, కూతురు శ్రీజ, తోడల్లుడి కొడుకు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, యాచారం, కందుకూరు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో బాలకృష్ణ పని చేశారు.
బాలకృష్ణ మృతిపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం తమతో కలివిడిగా ఉంటూ సందడి చేసే బాలకృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. అలాగే.. బాలకృష్ణ మృతితో ఆయన స్వగ్రామం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలకృష్ణ మృతిపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాకులు క్యామ మల్లేష్ సంతాపం తెలిపారు. (Agencies)