హైదరాబాద్: టాలీవుడ్లో విషాదం నెలకొంది. మరో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతేడాది కోవిడ్ బారిన పడిన తర్వాత… కైకాల అనారోగ్యానికి గురైనట్లు తమ్ముడు కైకాల నాగేశ్వర రావు చెప్పారు. కైకాల అంత్యక్రియలను శనివారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 నుంచి కైకాల పార్థీవదేహాన్ని ఉంచుతామన్నారు. కైకాల కుమార్తె చెన్నైలో ఉందని…ఆమె రావాల్సి ఉందన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం
నవరస నట సార్వభౌమ బిరుదాంకితుడు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలియజేశారు. కైకాల సత్యనారాయణ చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్నమైన పాత్రలను పోషించారని, వైవిధ్యమైన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కైకాల సత్యనారాయణ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కైకాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఫిల్మ్‌నగర్‌లో కైకాల భౌతికకాయాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. కైకాల అంత్యక్రియలు ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు సీఎస్‌కు అదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కైకాల మూడు తరాల నటుడు మరియు గొప్ప వ్యక్తి అని మంత్రి తలసాని కొనియాడారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం.
సత్యనారాయణ వందలాది సినిమాలలో విలక్షణ పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఆయన మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు. సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.
మంత్రి హరీశ్ రావు సంతాపం
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి నవరస నటసార్వభౌముడిగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తీరని లోటు – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
విలక్షణ నటుడిగా..ఘటోత్కచుడుగా సినీ అభిమానులను మెప్పించి, 777 చిత్రాలలో నటించిన కైకాల సత్యనారాయణ గారి మృతి చిత్ర సీమకు, అభిమానులకు తీరని లోటు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు
Related News:
చిరంజీవి
కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ కళామతల్లి ముద్దు బిడ్డ మరణం తీరని లోటని చిరంజీవి అన్నారు. కైకాల నటించిన వైవిద్యమైన పాత్రలను ప్రేక్షకులు మర్చిపోలేరని ట్వీట్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1606137673785249792?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606137673785249792%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
విలక్షణ నటుడిగా పేరొందిన ఆయన మృతి తెలుగు సినీ ఇండస్ట్రీకి,ప్రేక్షకులకు తీరని లోటు: ఎంపీ రవిచంద్ర
ప్రముఖ సినీ నటుడు,విలక్షణ నటుడిగా పేరొందిన కైకాల సత్యనారాయణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన సుమారు 800 సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి గొప్ప నటుడిగా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారని ఎంపీ రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.ఆయన మృతి తెలుగు సినీ ఇండస్ట్రీకి,ప్రేక్షకులకు తీరని లోటన్నారు, కైకాల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ వద్దిరాజు భగవంతున్ని ప్రార్థించారు.
బాలకృష్ణ
తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడ్ని కోల్పోయిందని బాలకృష్ణ చెప్పారు. సినీ, ప్రజా జీవితంలో కైకాల అందించిన సేవలు మరువలేనివన్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడని సినీ నటులు కొనియాడారు.
డైరెక్టర్ రాఘవేంద్రరావు
కైకాల ఒక చరిత్ర క్రియేట్ చేసాడు. గొప్ప జీవితం అనుభవించిన వ్యక్తి. అందరితో స్నేహంగా ఉండేవాడు. వచ్చే తరం వాళ్ళకి ఆయన ఆదర్శం.
https://twitter.com/urstrulyMahesh/status/1606143169866993687?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606143169866993687%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
https://twitter.com/ganeshbandla/status/1606115051839946753?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606115051839946753%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
https://twitter.com/IamSaiDharamTej/status/1606136452160507904?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606136452160507904%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
Saddened to hear about the passing away of legendary actor Kaikala Satyanarayana garu. He was one of the rarest acting personalities who can breathe life into any character.
— Anil Ravipudi (@AnilRavipudi) December 23, 2022
May his family find peace & strength in this hour of grief! Om shanti
https://twitter.com/ImSharwanand/status/1606133000114212865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606133000114212865%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
https://twitter.com/actorsrikanth/status/1606131278931263493?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606131278931263493%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
https://twitter.com/NameisNani/status/1606130110196613120?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606130110196613120%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
Very sad news!
— Ananya Nagalla (@AnanyaNagalla) December 23, 2022
End of an era!
Kaikala Satyanarayana garu is no more.
Navarasa Nata Sarvabhowma.#Kaikala Satyanarayana pic.twitter.com/ZOrp3H4bGT
https://twitter.com/anusuyakhasba/status/1606128540176371712?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606128540176371712%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
Saddened to know about the passing of Kaikala Satyanarayana garu. An absolute legend who immortalised many characters on our Telugu silver screen.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 23, 2022
Om Shanti
https://twitter.com/DirectorMaruthi/status/1606119995041140736?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606119995041140736%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death
https://twitter.com/BvsRavi/status/1606129650001813505?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1606129650001813505%7Ctwgr%5E1590348c3253eb8923d3b524236d63399a5ffd4b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-celebrities-pays-tribute-senior-actor-kaikala-satyanarayana-death