పూర్తిగా సహకరిస్తున్న ఎమ్మెల్సీ కవిత
Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను విచారణ చేయడానికి సీబీఐ బృందం ఆదివారం 10.50 ఘంటలకు MLC కవిత ఇంటికి చేరుకున్నారు. బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసింది. కాగా ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారించాల్సింది. అయితే ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ కేసులో కవితను సాక్షిగానే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే ప్రగతిభవన్‌లో న్యాయ నిపుణులతో పాటు తండ్రి సీఎం కేసీఆర్‌తో కవిత నోటీసులపై చర్చించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం సమావేశం కావడానికి సీబీఐ అధికారులకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాస పరిసరాలు నిర్మానుశ్యంగా మారాయి. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కలకలలాడే కవిత నివాస ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది.
సీబీఐ వస్తున్నప్పటికీ ఎటువంటి బలప్రదర్శన లేకుండా సాదాసీదాగా కవిత వ్యవహహరిస్తున్నారు. సిబిఐ అధికారులు ఉదయం 11 గంటలకు కవితా నివాసానికి రానున్నారు. పోలీసులు కవితా నివాసం సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. continue update…