రైతు పోరుబాట.. కాంగ్రెస్ నిరసనలు
అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు
భూమి సమస్యలపై కాంగ్రెస్ ధర్నాలు విజయవంతం
అన్ని నియోజక వర్గాలలో ధర్నాలు.. భారీగా పాల్గొన్న రైతులు, కాంగ్రెస్ శ్రేణులు
ఆర్.డి ఓ లకు వినతి పత్రాలు సమర్పించిన కాంగ్రెస్ నాయకులు...
Hyderabad : రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నియోజక వర్గ కేంద్రాలలో ధర్నాలు.. భారీగా పాల్గొన్న రైతులు, కాంగ్రెస్ శ్రేణులు… ప్రధానంగా ధరణి పోర్టల్ రద్దు చేయాలని, రుణ మాఫీ చేసి రైతులకు న్యాయం చేయాలని, పోడు రైతులకు పట్టాలను ఇవ్వాలని, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది
హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పోరుబాట
పీసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నేడు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ హాజరై అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్ డి ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని, ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని మరియు పలు ప్రజా, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది.
తెలంగాణ లో రైతు, భూమి సమస్యల పరిష్కారం కోరుతూ 21వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ల నేతృత్వంలో టీపీసీసీ బృందం రాష్ట్ర సిఎస్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరుస ఉద్యమాలకు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. 24వ తేదీన రాష్ట్రంలో అన్ని మండలాలలో మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేసింది.
30వ తేదీన నియోజక వర్గ కేంద్రాలలో ధర్నాలకు పిలుపు ఇచ్చిన కాంగ్రెస్.. నియోజక వర్గ సమన్వయ కర్తలను నియమించిన కాంగ్రెస్..డిసెంబర్ 5వ తేదీన జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు ఉంటాయి.
నర్సాపూర్ చౌరస్తా వద్ద…
నర్సాపూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పై నిరసన కార్యక్రమం చేపట్టారు..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపిసిసి సెక్రెటరీ గజ్జి భాస్కర్ యాదవ్ గారు. టీపీసీసీ అదికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ టీపీసీసీ కార్యదర్శి రాజి రెడ్డి టిపీసీసీ డెలిగెట్ రవీందర్ రెడ్డి గార్లు హాజరైయ్యారు. ఈ నిరసనకు రైతులు, ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు,రైతు భీమా, రైతు బంధు రాని బాధితులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని రైతుల విషయాల్లో మోసపూరిత వాగ్దానాలు చేశారని అన్నారు రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి నా ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు అన్నారు.వర్షాలు వస్తున్నా గానీ ఇప్పటి వరకు రైతుల యొక్క వడ్లు కొనుగోలు చేయడం లేదని అన్నారు..రైతులకు ఇచ్చిన వాగ్దానలు అమలుచేయకుండా మోసం చేస్తున్నారని తెలిపారు.ధరణి లో లోపాలు తీసేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి లా ఉందని తెలిపారు.
2023 సంవత్సరంలో నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MPP జ్యోతి సురేష్ నాయక్ అన్ని మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, INTUC నాయకులు, కిసాన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, NSIU నాయకులు, అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యదర్శులు, భూత్ కమిటీ లు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామగుండం నియోజకవర్గం…
రాష్ట్రా కాంగ్రెస్ పులుపు మేరకు రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో స్థానిక గోదావరిఖని చొరస్తాలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపిశెట్టి నిరంజన్ గారు పాల్గొని ప్రసంగిస్తూ గడిచిన 8 సంవత్సరాల నుండి రైతు రుణ మాఫీ కోసం ఎదుచూసి బ్యాంకులలో రినివల్ చేయక బాంక్ ఖాతాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టీ వారి ఆస్తులు జప్తు చేసే పరిస్థితులు వఛ్చి చివరకు కొంత మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ధరణి పోర్టల్ వల్ల అనేక మంది రైతులు తమ సొంత పొలాల్లో యాజమాన్యా హక్కుల కొరకు రెవెన్యూ కార్యాలయాలచుట్టు చెప్పులరిగెల తిరిగి అధికారుల మీద దాడులు చేసేవరకు పరిస్థితులు వెళ్లడం అంటే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయాలు చేస్తూ గిట్టుబాటు ధర చెల్లించక వారి కొనే పరిస్తితులులేకుండా చేశారు అలాగే పోడు భూముల సమస్యలు పరిష్కటించక పోవడంతో ఇటీవల ఫారెస్ట్ అధికారిని దాడి చేసి హత్యచేసి వరకు ప్రజలకు ప్రభుత్వ సంస్థలకు ఎంతటి యాగాండం ఏర్పడిందో చుస్తే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుస్తోంది ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతు సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన నిరంతరం పొరాటం చేస్తుందని రాబోయేరోజుల్లో కాంగ్రేస్ అధికారంలో వస్తుందని అన్ని సమస్యలు పరిష్కరిస్టుమాని అంతవరకు రైతులు దైర్యంగా ఉండాలని వారు సూచించారు.
రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్లాక్ 1 అధ్యక్షులు కాల్వ లింగ స్వామి మాజీ అధ్యక్షులు M రవికుమార్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి ఎండ్ ముస్తఫా, కొలిపాక సుజాత తేజస్విని ప్రకాష్ ,నగునూరి సుమలత రాజు, సన ఫేక్రోద్దీన్,రామగుండం మండల మాజీ mpp ఉరిమెట్ల రాజలింగం బీసీ సెల్ నాయకులు పెండ్యాల మహేష్ గట్ల రమేష్ రవి యాదవ్ చంద్రమౌళి కుమారస్వామి మురళి మాటేటి సతీష్ విజయ్ గౌడ్ కృష్ణ sc సెల్ నాయకులు తాళ్లపెళ్లి యుగేoదర్ దులికట్ట సతీష్ మిట్టపెళ్లి మహేందర్ యూత్ కాంగ్రేస్ నాయకులు నాజిమోద్దీన్ అడపా సాయి కిరణ్ జ్యోతి మెహరాజ్ అజయ్ nsui దాసరి విజయ్, ఉదయ్ md రహీం ఫజల్ ముస్తఫా, బుర్ల రవి, నంది వెంకటేష్, కుంట సది దశరడం ఉర్సు అనిల్ ఖదీర్ పొయ్యిలా సతీష్ తిరుపతి రెడ్డి, కార్తీక్ మహేష్ మహిళా కాంగ్రెస్ నాయకులు శరణ్య లావన్య సల్మా అనిత చౌదరి స్రవంతి శంకరమ్మ సరితా రామగుండం నాయకులు అధ్యక్షులు హరి ప్రసాద్ అప్పసి శ్రీనివాస్ అల్లి శంకర్ మరియు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా…
ఈరోజు మెదక్ పట్టణంలో పోస్టాఫిక్ చౌరస్థలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి గారు రైతుల సమస్యలైన రైతు రుణ మాఫి, ధరణి పోర్టల్ రద్దు, పొడు భూముల సమస్యల పరిష్కారం కోసమై నిరసన దిక్ష చేపట్టడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వమంటేనే అబద్దాల ప్రభుత్వంగా మారిందని అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి ఈ ప్రభుత్వం లక్ష రూపాయల రుణ మాఫి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది, కాని నేటికీ 4 సంవత్సరాలు గడుస్తున్న మాఫి అవ్వకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టు తిరుగుతూ కొత్తగా అప్పు పుట్టాక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు, ముమ్మాటికీ ఇవ్వి ప్రభుత్వ హత్యలుగానే భావించాలని ఆయన అన్నారు.
అలాగే ధరణి పోర్టల్ తీసుకోరావడం ద్వారా లక్షలది ఎకరాల రైతుల భూములు ఆగమవ్వడం జరిగింది, ఆన్లైన్ లో పెద్ద ఎత్తున తప్పులు దొరలడం జరిగింది, ఎన్నో యేండ్లుగా వారి పేరు మీద ఉన్న భూములను కోల్పోవడం తో రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు, ధరణి పోర్టల్ అనేదే దొరల పోర్టల్ గా మారిందని ఆయన దుయ్యబట్టారు, అందుకే వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేసి పాత విధానం కొంనసగించలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే పొడు భూముల కోసం దళితులు, గిరిజనులు హక్కుల కోసము పోరాటం చేస్తున్నారు. వెంటనే సాగుచేకుంటున్న ప్రతి ఒక్క రైతు కు భూమి పై హక్కులు కలిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరెషన్ లో చెప్పినట్లు అధికారంలోకి రాగానే 2 లక్షల రుణ మాఫి చేయడంతో పాటు ధరణి పోర్టల్ రద్దు చేస్తూ అందులో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాన్ని నెరవేరుస్తామని అన్నారు, అలాగే త్వరలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టానున్ను యాత్రను మెదక్ నియోజకవర్గం నుండి ఉండే విధంగా ఆయన తో చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు మ్యాడము బాలకృష్ణ, మామిళ్ల ఆంజనేయులు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పల్లె రాంచందర్ గౌడ్, sc సెల్ జిల్లా అధ్యక్షులు శంసుందర్, బ్లాక్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, హాజీజ్, శంకరంపేట వైస్ ఎంపీపీ సత్యం గౌడ్, మండలల అధ్యక్షులు రమణ, శం రెడ్డి ,శ్రీనివాస్ ,గోవింద్, శంకర్, st సెల్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఎంపీటీసీ లు, శ్రీనివాస్, ప్రసాద్, రమేష్ గౌడ్, శ్రీహరి, సిద్ధ గౌడ్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రం లోని రైతు పోరు బాట కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని రైతులకు మద్దత్తుగా ఆందోళనలు చేపట్టారు. రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన ఆందోళనకు భారీగా స్పందన వచ్చింది. రాష్ట్ర నాయకులు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జి లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు, ముఖ్య నాయకులు అందరూ ధర్నాలలో పాల్గొన్నారు.
రైతాంగ సమస్యల పరిష్కారానికై ఉద్యమ కార్యాచరణలో భాగంగా పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి, చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యంలు హాజరై రైతు సమస్యలపై గళమెత్తారు. యదాద్రి భువనగిరి జిల్లాలో పిసిసి పిలుపు మేరకు రైతు సమస్యలు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ మండలం RDO కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి పాల్వాయి స్రవంతి పాల్గొన్నారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి హాజరై ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా, మంథని ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన దీక్ష జరిగింది.
శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇంతవరకు చేయలేదని గుర్తుచేశారు. ఫారెస్ట్ అధికారి మరణానికి కారణం పోడు భూములపై ప్రభుత్య నిర్లక్ష్యమేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతు చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పొడు భూములు మరియు ధరణి పోర్టల్ నకిలీ విత్తనాల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు చేపట్టిన ఆందోళనల్లో డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.
అదే విదంగా మక్తల్, హన్మకొండ జిల్లా పరకాల, దేవరకొండ, వికరాబాద్ జిల్లా కొడంగల్, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ రైతుల సమస్యలపై టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన పోరాటంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిర్వహించిన సదస్సులో మాజీ మంత్రి జె. గీతారెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ నాయకుడు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. జనగాం నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిదంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు.
సూర్యాపేట డివిజన్ ఆర్డీవో అధికారి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు పిసిసి అధికార ప్రతినిధి కాల్వ సుజాత,పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్ రావు, పాల్గొన్నారు.
రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ధరణి పోర్టల్ రద్దు, రైతు భీమా, రైతు రుణమాఫీ, పోడు భూములు, పంటలకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేయాలని భారీ సంఖ్యలో రైతులు, నాయకులతో కలిసి రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆర్డీవో గారికి మెమొరాండం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా చెవిటి వెంకన్నయాదవ్, కాల్వ సుజాత మాట్లాడుతూ…
💥రైతుల కష్టాలు, సమస్యలను తాసిల్దార్ కు వివరించాం…
👉🔥 లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీ వెంటనే అమలు చేయాలి
👉🔥 కౌలు రైతు చట్టం అమలు చేయాలి..
👉🔥 పోడు రైతులకు పట్టాలు ఇప్పించాలి…
👉💥 అటవీ హక్కుల చట్టం అమలు చేయాలి…
👉🔥 ధరణి పోర్టల్ వెంటనే ఎత్తివేయాలి
💥భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి…
💥24లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదు…
💥తక్షణమే భూ సమస్యలను పరిష్కరించాలి…
💥ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది…
💥ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం…
💥పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది…
💥అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి…
💥తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 05 వ తేదీన ధరణి బాధితులతో కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతాం అని తెలిపారు…
ఈ కార్యక్రమంలో పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమల్లా రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు అమరవరపు శ్రీనివాస్, పెన్ పహాడ్ మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, ఆత్మకూర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కండల వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కుంట్ల వెంకట నాగిరెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలగాని బాలు గౌడ్, డీసీసీ కార్యదర్శులు రుద్రంగి రవి, పిడమర్తి మల్లయ్య, అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్,జిల్లా సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, పట్టణ INTUC అధ్యక్షుడు వల్డసు శ్రీను(రెబల్), పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ యలగందుల సాయినేత, జిల్లా కాంగ్రెస్ నాయకులు రేతినేని శ్రీనివాస రావు,గార్లపాటి వెంకట్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శిగ శ్రీను, కోడి కుమార్ యాదవ్, గుణగంటి సైదులు, ఖమ్మంపాటి మధు, శివ నాయక్, పల్సా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.