హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్- 4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ అనుమతుల జీవో కాపీలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఉద్యోగ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
జీవో కాపీ ప్రకారము వార్డు ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో అత్యధికంగా 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా రెవెన్యూ శాఖలో 2,077, పంచాయతీ రాజ్ శాఖలో 1,245 పోస్టులు ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్‌లో 44, యానిమల్ హస్బెండరీలో 2, బీసీ వెల్ఫేర్‌లో 307, సివిల్ సప్లయ్స్‌లో 72, ఎనర్జీలో 2, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్‌లో 23 పోస్టులు ఉన్నాయి.
అలాగే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్డిపార్ట్మెంట్లో వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అదేవిధంగా ఫైనాన్స్‌లో 46, జీఏడీలో 5, హెల్త్ అండ్ మెడికల్‌లో 338, హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 742, హోం శాఖలో 133, ఇండస్ట్రీస్‌లో 7, ఇరిగేషన్‌లో 51, లేబర్ డిపార్ట్‌మెంట్‌లో 128, మైనార్టీ వెల్ఫేర్‌లో 191, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌లో 601, ప్లానింగ్‌లో 2, ఎస్సీ డెవలప్‌మెంట్‌లో 474, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 97, ట్రాన్స్‌పోర్ట్‌లో 20, ట్రైబల్ వెల్ఫేర్‌లో 221, విమెన్ అండ్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్‌లో 18, యూత్ అడ్వాన్స్‌మెంట్‌లో 13 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి.ఈ ప్రకటన చూసి ఉద్యోగ అభ్యర్థులు సంతోషము వ్యక్తము చేస్తున్నరు.