2 వేలమందికి పైగా దివ్యాంగులకు లబ్ది
దివ్యాంగుల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించిన సంజయ్
రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే దివ్యాంగుల సంక్షేమ భవన్ నిర్మించేందుకు సిద్ధమన్న బండి
Hyderabad: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు వేములవాడలో దివ్యాంగుల, వయోవ్రుద్దుల సౌకర్యార్థం ప్రత్యేక పరికరాలను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ADIP (Assistance to Disabled Persons), రాష్ట్రీయ వయోశ్రీ యోజన (RVY) పథకాల కింద 2 కోట్ల 33 లక్షల 47 వేల 768 రూపాయల వ్యయంతో దివ్యాంగులకు, వయోవ్రుద్దులకు వీల్ ఛైర్లు, వినికిడి యంత్రాలుసహా వివిధ ఉప కరణాలను స్వయంగా అందించారు. ఈ సందర్భంగా వేములవాడలోని ఎస్సారార్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు పరికరాలకు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు...
• ఈరోజు సమాజంలో అన్ని అవయవాలు ఉన్నోళ్లే ఇబ్బందులు పడుతున్నరు. దివ్యాంగుల ఇబ్బందులు వర్ణణాతీతం. వారిని చూసి బాధపడటం కాదు… ఆ బాధ రాకుండా చేయాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. అలాంటి వారికి ఏ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. దేశంలోని దివ్యాంగుల సోదరీసోదరమణులకు ప్రత్యేక పథకాలు అందిస్తోంది.
• కేంద్ర ప్రభుత్వం ADIP (Assistance to Disabled Persons), రాష్ట్రీయ వయోశ్రీ యోజన (RVY) పథకాల కింద ఈరోజు 2 కోట్ల 33 లక్షల 47 వేల 768 రూపాయల విలువైన పరికరాలను దివ్యాంగ సోదరసోదరీమణులకు, వయో వ్రుద్దులకు పంపిణీ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది.
• కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన ఈ నిధులతో 2 వేల 32 మంది దివ్యాంగులతోపాటు వయో వ్రుద్దులకు అవసరమైన పరికరాలను అందజేయడం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఈ మొత్తం నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 46 లక్షల 58 వేల రూపాయలు ఉంది.
• ALIMCO సంస్థ ADIP పథకం ద్వారా దివ్యాంగులకు మరియు RVY పథకం ద్వారా వయోవృద్ధులను ఎంపిక చేయడం జరిగింది.
• ADIP పథకం ఉద్దేశం ఒక్కటే… అదేమిటంటే… వైకల్యంతో దివ్యాంగులు బాధపడకుండా ఆ ప్రభావాన్ని తగ్గించటంతోపాటు వారు స్వతంత్రంగా, ఆర్దికంగా నిలదొక్కుకునేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
• నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులు, వయోవ్రుద్ధుల సంక్షేమంపై ప్రత్యేక ద్రుష్టి సారించింది. అందుకోసం పెద్ద ఎత్తున నిధులు కూడా విడుదల చేస్తోంది.
• ముఖ్యంగా దివ్యాంగులు, వయోవ్రుద్దులు బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణ స్థలాల్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోదీగారి ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. అందులో భాగంగా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ (సుగమ్య భారత్ అభియాన్) పేరుతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల వద్ద వారి కోసం ప్రత్యేకంగా వాష్ రూంలు, వీల్ ఛైర్లు, ఇతరత్రా సదుపాయాలను కల్పిస్తోంది.
• కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులందరి సమస్యలు తెలుసుకుని.. వాటి పరిష్కారానికి సంపూర్ణంగా క్రుషి చేస్తాను. త్వరలో కరీంనగర్ లో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం.
• దివ్యాంగు సంఘం నేతలు దివ్యాంగుల సంక్షేమ భవన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే దివ్యాంగు సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంసిద్ధంగా ఉన్నాది.