हैदराबाद : टॉलीवुड में एक और त्रासदी हुई है। वरिष्ठ अभिनेता कैकाल सत्यनारायण का निधन हो गया। वह कुछ समय से बीमार चल रहे थे। हैदराबाद स्थित अपने फिल्मनगर आवास पर इलाज के दौरान शुक्रवार को सुबह चार बजे अंतिम सांस ली। कैकाल सत्यनारायण ने 750 से अधिक फिल्मों में अभिनय किया।
खलनायक और चरित्र कलाकार के रूप में अभिनय किया। कैकाल सत्यनारायण की मौत की खबर सुनकर टॉलीवुड में शोक की लहर है। कैकाल सत्यनारायण ने अपने प्रदर्शन से दर्शकों का काफी मनोरंजन किया। 87 साल के सत्यनारायण ने 60 साल फिल्मी दुनिया से जुड़े रहे।
कैकाल सत्यनारायण का जन्म 25 जुलाई 1935 को कौतावरम गांव, गुड्लावल्लेरु मंडल के कृष्णा जिले में हुआ था। विजयवाड़ा और गुडीवाड़ा में उनकी पढ़ाई हुई। कैकाल सत्यनारायण ‘नटसर्वभौम’ के नाम से जाने जाते हैं। 1960 में कैकाल सत्यनारायण ने नागेश्वरम्मा ने शादी कर ली। कैकाल के परिवार में उनकी पत्नी नागेश्वरम्मा, एक बेटा और दो बेटियां हैं। 1959 में उन्होंने ‘सिपाई कुतुरु’ फिल्मी जगत में प्रवेश किया। उन्होंने अपने 60 साल के करियर में 750 से ज्यादा फिल्मों में काम किया। खासकर यमराज की भूमिका से वह दर्शकों के दिलों में बस गये। कैकाल का अंतिम संस्कार शनिवार को महाप्रस्थान में किया जाएगा।
अपडेट जारी…
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కైకాల సత్యనారాయణ దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. 87ఏళ్ల సత్యనారాయణ 60 ఏళ్ల సినీజీవితాన్ని అనుభవించారు.
కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా పేరుగాంచారు. 1960లో కైకాల నాగేశ్వరమ్మల వివాహం జరిగింది. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 60 ఏళ్ళ నటప్రస్థానంలో 750 సినిమాలకు పైనే నటించారు. ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. రేపు మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి.