హైదరాబాద్ : నిలోఫర్ వద్ద హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు. కర్ణాటకలో కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు.
శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలి. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడు. కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీ ని, జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కారించారు.
కర్ణాటక తీర్పును కాంగ్రెస్ సాధరంగా స్వాగతిస్తున్నాం. దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారు.
కర్ణాటకలో వచ్చిన ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఎర్రకోటపై కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడం ద్వారా మోదీని ఓడించారని, జేడీఎస్‌ను ఓడించడం ద్వారా కేసీఆర్‌ను ఓడించినట్లు అయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటక ఫలితాలను టీపీసీసీ ఆహ్వానిస్తుందన్నారు
కర్ణాటక ఫలితాల ద్వారా మోదీ, బీజేపీని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారని రేవంత్ రెడ్డి చెప్పారు. జేడీఎస్ ద్వారా హంగ్ అసెంబ్లీ తీసుకురావాలన్న కేసీఆర్ ఆశలు ఫలించలేదన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ద్వారా ఈ ఫలితాలు వచ్చాయని, తెలంగాణలోనూ స్దిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ క్యాంపు రాజకీయాలకు కర్ణాటకలో చోటు ఉండదని, బీజేపీది దింపుడు కళ్లెం ఆశ అని అభివర్ణించారు. కేసీఆర్ మద్దతు ఇచ్చిన జేడీఎస్ పార్టీ బీజేపీకి ఎలా మద్దతిస్తుందని రేవంత్ ప్రశ్నించారు.