Hyderabad: నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం మాట్లాడుతూ… గత సంవత్సర కాలంగా రాష్ట్రములో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం, ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనే కొన్ని జాతీయ పార్టీల కుట్రగా కనిపిస్తుంది. గవర్నర్ గారి వ్యవహార శైలి, బిజేపి దత్త పుత్రిక షర్మిలా పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు అన్యయుడు మరో జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు ఉపన్యాసములు, ED, CBI దాడులు, MLA ల కొనుగోలు వ్యవహారం ఇవ్వన్ని కూడా సమైక్య వాదుల కుట్రలో బాగంగా కనిపిస్తుంది.
ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికే విఘాతం కలిగిస్తున్న తీరును చూసి యావత్ తెలంగాణ ప్రజానీకం మేలుకోవాల్సిన సమయం వచ్చింది. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మరియు హైదరాబాద్ నడిబొడ్డున ఎన్నో అరాచక సంఘటలను, హత్యాలను, తుపాకుల మోతను, రక్తం ఏరులై పారినా ఘోరాలను, బాంబుల మోతను, రౌడీల రాజ్యాన్ని, భూ కబ్జాలు, అనేక ఘటనలను మనం చూస్తూ, భరిస్తూ వచ్చాం.
పోరాడి తెచ్చుకున్నా తెలంగాణ రాష్ట్రoలో అలాంటి సంఘటనలు పునారావృత్తం కాకుండ,మత విద్వేషాలు జరగకుండా శాంతియుతంగా, ప్రశాంతంగా మనం జీవించాలీ అంటే ప్రస్తుతం జరుగుతున్నకుట్రలను తిప్పికొట్టాలి
గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా సంఘటనలుజరగకుండా అభివృద్ధి ద్యేయంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సోదర భావంతో జీవిస్తున్నారు.కానీ రాష్ట్రములోవిద్వేషాలురెచ్చగొట్టి,ప్రజల మధ్య చిచ్చు పెట్టె విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉండటం విచారకరం
ఒక్క KCR గారిని మరియు ఆయన కుటుంబాన్ని రాజకీయముగా అడ్డు తొలగించుకుంటే తెలంగాణాను ఆక్రమించుకోవచ్చునని సమైక్య వాదులకుట్ర
2014లో బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 మండలాలను ,సిలేరు పవర్ ప్రాజెక్టు ను ఏపీ రాష్ట్రములో కలిపి తెలంగాణ రాష్టానికి తీరని అన్యాయం చేసింది.ఆ రోజు నుండి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రముపై సవితి ప్రేమ చూపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బతీయలనే కుట్రతో ,రాష్టానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది.
తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త,పోరాడి ,కొట్లాడి ఎన్నో బాధలకు తట్టుకొని సాధించు కున్న తెలంగాణ రాష్టాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది.ఒక్కసారి మళ్ళీ సమైఖ్య వాదుల చేతిలోకి వెళితే కుట్రదారులు మన రాష్టాన్ని అన్ని విధాలుగా అస్తవ్యస్తం చేస్తారు.
తెలంగాణ ప్రజలు,మేధావులు, విద్యార్ధి లోకం అందరూ కూడా కెసిఆర్ గారికి అండగా ఉండి, సమైక్య వాదులకు తగిన గుణపాఠం చెప్పాలి తెలంగాణ రాష్టాన్ని కాపాడుకుందాం రాష్ట్ర ప్రగతిని కొనసాగిద్దాం.
బిజెపి దత్తపుత్రిక షర్మిల అవినీతి పై మాట్లాడటం విడ్డురంగా ఉంది.అధికారంలో ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడి, జైళ్లకు వెళ్ళింది ఆమె కుటుంబ సభ్యులు. వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళతో పాటు అధికారులను కూడా జైళ్ల చుట్టూ తిరిగేలా చేసింది ఆమె కుటుంబ సభ్యులు కేసీఆర్ గారి నాయకత్వమే రాష్టానికి శ్రీ రామ రక్ష. లేకుంటే రాష్టము అస్తవస్త్యం అవుతుంది.