हैदराबाद: केंद्र सरकार ने कई राज्यों के राज्यपाल बदलने का फैसला लिया है। राष्ट्रपति द्रौपदी मुर्मू ने 12 नए राज्यपालों की नियुक्ति को मंजूरी दी। विश्वभूषण हरिचंदन, जो वर्तमान में एपी के राज्यपाल हैं, को छत्तीसगढ़ के राज्यपाल के रूप में नियुक्त किया है।
उनके स्थान पर सैयद अब्दुल नजीर को नियुक्त किया गया। नजीर ने पहले सुप्रीम कोर्ट के जज के रूप में काम किया। अब्दुल नज़ीर का जन्म कर्नाटक राज्य के एक मुस्लिम परिवार में हुआ।
ఏపీ కొత్త గవర్నర్గా సయ్యద్ అబ్దుల్ నజీర్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్ లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య, ట్రిపుల్ తలాక్ కేసులలో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఆయన ఉన్నారు.
ఆయన స్థానంలో సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకమయ్యారు. ఈయన గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్దుల్ నజీర్ చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించారు.
న్యాయశాస్త్ర పట్టా తీసుకున్న సయ్యద్ అబ్దుల్ నజీర్ 1983లో లాయర్ గా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత అదే హైకోర్టులో ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు.
2017లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడే భారత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 2017లో సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ విశ్వాసాల బెంచ్‌లో నజీర్ ఏకైక ముస్లిం న్యాయమూర్తి. ఈ ఏడాది జనవరి 4న ఆయన పదవీ విరమణ చేశారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్‌కు త్రివిక్రమ్ పర్నాయక్, జార్ఖండ్‌కు రాధాకృష్ణన్, అస్సాంకు గులాబ్‌చంద్ కటారియా, బీహార్‌కు రాజేంద్ర విశ్వనాథ్, హిమాచల్‌ప్రదేశ్‌కు శివప్రసాద్ శుక్లా, మణిపూర్‌కు అనసూయ, లడఖ్‌కు బీడీ మిశ్రా, నాగాలాండ్‌కు గణేషన్, మేఘాలయకు చౌహన్‌లను కేంద్రం నియమించింది.
వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం, లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనునన్న క్రమంలో ప్రస్తుతం ఉన్న గవర్నర్లను మార్చి కొత్త గవర్నర్లను నియమించడం చర్చనీయాంశంగా మారింది. (ఏజెన్సీలు)