Special Article: అస్తమించని సరస్వతి పుత్రుడు, మానవతావాది ప్రొఫెసర్ RVR చంద్రశేఖర రావు

[Note: ఒక మంచి వ్యక్తి గురించి మంచి వ్యాసాన్ని పంపినందుకు రచయిత షేక్ మహమ్మద్‌కి కృతజ్ఞతలు]

RVR చంద్రశేఖర రావు గారు ఒక ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త, అన్నిటికీ మించి ఒక మంచి మనసున్న మనీషి. మానవత్వానికి, మానవతా విలువలకు, మానవ సంబంధాలకు, బంధు మిత్ర పరివారాలతో సత్సంబంధాలు కలిగిన కలియుగ పురుషుడు. తాను మనసా, వాచా, కర్మణా ఆచరించటమే కాకుండా, ఎదుటివారికి అర్ధమయ్యే రీతిలో హితబోధ చేసే గొప్ప వ్యక్తి. వారు పైనుదహరించిన త్రికరణ శుద్ధి గురించి నాతోచెపుతూ “మొహమ్మద్ వాక్కు, కర్మలకన్నా మనసు చాలాప్రధానమైనదని. ఎందుకంటే, మనసు మన ఆధీనంలో ఉంటే మన మాట, మన చేతలు తదనుగుణంగానే వుంటాయని” అనేవారు.

ఎవరినీ తూలనాడి మాట్లాడటం, తృణప్రాయంగా తీసివేయటం తెలియని తెలివిగల పదహారణాల తెలుగు తపస్వి, నిగర్వి. కుల మత భేదాలకు వీరు అతీతులు. అందరినీ సమ దృష్టితో చూసేవారు. అన్ని మతాలవారికీ అప్పుడప్పుడూ చందాలు ఇస్తుండేవారు. వీరు ఏంతోమంది విద్యావేత్తలను, ప్రజాసేవకులను (civil servants) తీర్చిదిద్దారు. వీరు గురువులకే గురువు లాంటివారు. ఎంతోమంది విద్యార్థులను పరిశోధన పట్ల ఆకర్షితులను చేయటానికి ప్రోత్సహించారు. వీరు ఆగర్భ విద్యావంతులు అనటంలో అతిశయోక్తిలేదు. వీరి జ్ఞాపకాలు మన మదిలో ఎప్పటికీ పదిలంగావుంటాయి.

వీరి ఉపన్యాసాలు ఆహూతులను పడికట్టుపదాలతో కట్టిపడేసేవి, మంత్రముగ్దులను చేసేవి. వీరి English ఉచ్చారణ ఎంతో ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా, శ్రావ్యంగా ఉండేది. వీరి ఉపన్యాసాలు వినాలని, వారి subject వారే కాకుండా, ఇతర subjects వారు కూడా వచ్చి వింటూ ఉండేవారని ప్రత్యక్ష సాక్షులు చెపుతుంటారు. RVR గారు సాక్షాత్తూ సరస్వతీ పుత్రులు. విద్యతో పాటు వేదాంత ధోరణి కూడా వీరికి మెండు. దేవుడున్నాడని రుజువుచేయటం యెంత కష్టమో, దేవుడు లేడని రుజువుచేయటం కూడా అంతేకష్టమని చెప్పేవారు. ‘మంచితనం’ గొప్పతనంకన్నా మంచిదని చెప్పిన మంచిమనిషి RVR గారు. వీరు అసాధారణ ప్రజ్ఞతో వెలిగిన విజ్ఞులు.

ప్రొఫెసర్ RVR చంద్రశేఖర రావు మరియు Dr Sheik Mohammad

RVR గారు అప్పటి Madras Presidency లో నున్న Berhampur నందు 12th May, 1933 న జన్మించారు. Khallikote కళాశాలలో Economics and Political Science లో 1952 సంవత్సరంలో పట్టభద్రులైనారు. 1954 సంవత్సరంలో Banaras Hindu University నుంచి M.A. చేశారు. ఆతర్వాత Banaras Hindu University వారు అందజేసిన Holkar Fellowship మరియు London School of Economics వారు అందచేసిన Leverhulme Overseas Fellowshipలతో London School of Economics and Political Science నందు Ph.D. చేశారు. వీరు Ph.D. ‘Dissertation Judicial Review in India: A study in Constitutional Theory and Judical Practice’ అనే అంశంపై పరిశోధన చేశారు. తన Ph.D. Prof. S.A. De Smith పర్యవేక్షణలో జరిగింది. తన 26 వ యేటలో Ph.D. పూర్తిచేయటం RVR గారి ప్రతిభకు నిదర్శనం. 1959 సంవత్సరంలో RVR గారికి Ph.D. ప్రదానం అయ్యింది. తర్వాత London నుండి India కు తిరిగి వచ్చారు. Andhra University లో August 1959 లో Political and History Lecturer గా చేరారు. December 1979 వరకు Lecturerగా, Readerగా, Professor గా సుమారు 20 సంవత్సరాలు పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తితోపాటు, ఎన్నో administrative పదవులు చేపట్టారు.

Andhra University లో పనిచేస్తుండగానే 1966-67 విద్యా సంవత్సరంలో Senior Fulbright Postdoctoral Fellowhsip పై ఎంపికచేయబడి Yale University, USA వెళ్లారు. అక్కడ Professor Harold Lasswell వారి పర్యవేక్షణలో పనిచేశారు. Asia లో జరిగిన ఎన్నో అంతర్జాతీయ సమావేశాల్లో UK, Europe, USA, Canada, Africa, Australiaలలో హాజరయ్యారు. November 1985 సంవత్సరంలో UN headquartersలో జరిగిన Namibia Conferenceలో పాల్గొన్నారు. ఆనాటి అంతర్జాతీయ సదస్సులో ‘International Relations and Strategic and Peace Studies’ అనే ప్రత్యేక అంశంపై ప్రసంగించారు.

Andhra Universityలో పనిచేసిన తర్వాత University of Hyderabadలో December 1985 నుండి August 1989 వరకు వివిధ ఉన్నత పదవులు చేపట్టారు. Political Scienceలో Professorగా, Department Headగా, Dean, School of Social Sciencesగా వీరు తమ సేవలనందించారు. తర్వాత Andhra Pradesh Open Universityకి (ఇప్పటి Dr. B. R. Ambedkar Open University) Vice-Chancellorగా 25th September, 1989 న నియమితులయ్యారు. వారి పూర్తి పదవీకాలం 24th September, 1992 వరకు V. C.గా కొనసాగారు. వీరిలాంటి ప్రముఖులు పనిచేయటంవల్ల ఆ విద్యాసంస్థలకే వన్నె వస్తుంది.

వీరు Open University విద్యా విధానానికి ఎంతగానో కృషిచేశారు. తన పదవీ కాలంలో ఎంతో మంది ఉద్యోగులకు సకాలంలో న్యాయం చేకూర్చారు. అప్పటి ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగిఉండి రోజువారీ వేతనాలపై పనిచేసే వారిని శాశ్వత పద్ధతిలో ఉత్తర్వులు ఇప్పించారు. ఉద్యోగుల (teaching and non-teaching) మన్ననలను పొందారు. వీరి హయాంలో ఎంతోమంది పదోన్నతులు పొందారు. ఇప్పటికీ, ఎప్పటికీ RVRగారి సహాయంపొందిన విశ్వవిద్యాలయ ఉద్యోగులు వీరిని ఒక దేవుడిగా భావిస్తారు. కారణం – ఉద్యోగుల కష్టనష్టాలను పూర్తిగా అర్థంచేసుకొని, మానవతా దృక్పథంతో, సానుభూతితో వారికి సహాయంచేయటమే. అందుకే వీరు చిరస్మరణీయులు.

1988 సంవత్సరంలో Commonwealth దేశాల Prime Ministers అందరూ కలిసి Canadaలోని Vancouver నగరంలో Commonwealth of Learning (COL) అనే ఒక అంతర్జాతీయ దూరవిద్యా సంస్థను స్థాపించారు. దీని ముఖ్యోద్దేశం దూర విద్య మరియు విద్యకు communication technologies ఉపయోగించడం ద్వారా నేర్చుకునే అవకాశాలను సృష్టించడం మరియు విస్తృతం చేయడం. COLకు RVR గారిని Director, Asian Programmes and Trainingగా ఆహ్వానించి నియమించారు. అక్కడ వీరు నాలుగు సంవత్సరాలపాటు (1992-1996) పనిచేశారు. ఈ పదవిని అలంకరించే సమయంలోనే భారత ప్రభుత్వం వీరిని University Grants Commission (UGC) Chairmanగా నియమించటానికి సిద్ధపడింది. కానీ RVR గారు COLకి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. కారణం ఒకటి జాతీయ స్థాయిలో ఉంటే, మరొకటి అంతర్జాతీయ స్థాయిలో ఉండటమే.

RVR గారు కొన్ని పుస్తకాలను ప్రచురించారు. అవి మచ్చుకు: “Indian Unity” a symposium (edited), “From Innocence to Strength” a book on Indian Foreign Policy. వీరి పరిశోధనా వ్యాసాలు Survival, Asian Survey, bulletin of the Atomic Scientist లాంటి ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరు Encyclopaedia Britannica వారి Bicentenary edition రూప కల్పనలో తన సహాయ సహకారాలను అందజేశారు.

RVRగారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరూ ఉన్నత పదవుల్లో స్థిరపడ్డారు, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. RVRగారు, వారి సతీమణి శ్రీమతి Prathibha Annapurna గారు బ్రతికినంతకాలం ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా, ఆదర్శ దంపతులుగా వున్నారు. RVR గారిని వదిలి వారి సతీమణి 08-03-2021 న స్వర్గస్తులైనారు. RVRగారు వారి సహధర్మచారిణి గారి జ్ఞాపకాలతో గడుపుతూ 08-02-2024 నాడు తుది శ్వాస విడిచారు.

వీరి మరణం కుటుంబ సభ్యులకే కాకుండా, వారిని ప్రేమించే ఎంతోమంది స్నేహితులకు, తోటి సమకాలీయులకు, వారిని గౌరవించే శిష్యులకు, వారిని ఆరాధించే సామాన్యులకు ఒక పెద్ద దిక్కును కోల్పోయామనే భావనను మిగిల్చింది. RVRగారి అస్తమయం ఎంతోమందికి దుఃఖ దాయకం. అందరూ RVRగారికి 10th February, 2024న అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్ధించుకుందాము.

– Dr. Sheik Mohammad, A Student Of RVR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X