कालेश्वरम : विजिलेंस रिपोर्ट में चौंकाने वाले सच, CM रेवंत रेड्डी का बड़ा फैसला, विश्लेषकों का हैं यह मानना?

हैदराबाद: सिंचाई विभाग के अधिकारियों ने निष्कर्ष निकाला है कि कालेश्वरम परियोजना के वित्तीय बोझ और कर्ज के कारण सीमित परिणाम मिले हैं। इंजीनियर सुधाकर रेड्डी ने अपने पावर पॉइंट प्रेजेंटेशन में बताया कि परियोजना की कुल लागत 93,872 करोड़ रुपये है, जिसमें से 61,665 करोड़ रुपये निगम के नाम पर लिया गया ऋण है और अन्य 32,207 करोड़ रुपये सरकार ने बजट से जारी किए हैं। ‘अयाकट्टू’ के अंतर्गत 19.63 लाख एकड़ को खेती करने का लक्ष्य रखा गया था, तो पाँच वर्षों में केवल 98,570 एकड़ ही खेती करना संभव हो सका है।

सुधाकर रेड्डी ने बताया कि पिछली सरकार ने अनुमान लगाया था कि कालेश्वरम 3 टीएमसी पर लगभग 32,165 करोड़ रुपये खर्च होंगे। इसके लिए ऋण के माध्यम से 16,669 करोड़ रुपये और सरकार से 2,817 करोड़ रुपये खर्च किया। तीसरी टीएमसी बिजली खपत और भूमि अधिग्रहण जरूरतों के लिए 33,459 करोड़ का अनुमान लगाया गया है। अबतक 20,372 करोड़ पहले ही खर्च किए जा चुके हैं। कालेश्वरम की कुल अनुमानित लागत 1.28 लाख करोड़ पहुंच गई है। अब तक के खर्च में से 73,500 करोड़ रुपये 2 टीएमसी की जरूरतों के लिए और 20,372 करोड़ रुपये तीन टीएमसी की जरूरतों के लिए खर्च किये गये।

मेडीगड्डा बैराज क्षति घटना पर तीन दिनों तक फील्ड अध्ययन करने वाले सतर्कता अधिकारियों ने कई प्रमुख बिंदुओं का खुलासा किया। सतर्कता विभाग के महानिदेशक राजीव रतन ने कहा कि जबकि परियोजना के माध्यम से सालाना 180 टीएमसी की दर से पानी उठाने और उपलब्ध कराने का लक्ष्य रखा गया। पांच वर्षों में (2019-20 से 2023-24 तक) कुल 900 टीएमसी में से केवल 162.36 टीएमसी ही उठाया गया। अपेक्षित लक्ष्य का केवल 18.04% ही हासिल किया जा सका। मेडीगड्डा बैराज की अनुमानित लागत शुरुआत में केवल 1,849 करोड़ थी, फिर यह 2,591 करोड़ और अंत में 4,321 करोड़ तक पहुंच गयी। कुल मिलाकर 133.6 फीसदी ज्यादा खर्च हुआ।

राजीव रतन ने कहा कि ब्लॉक 7 का निर्माण निर्धारित योजना के विरुद्ध किया गया और एक संयुक्त उद्यम के हिस्से के रूप में उप-ठेके पर दिया गया था, भले ही ठेका लेने वाली कंपनी एलएंडटी थी। 21 जून, 2019 को अपनी स्थापना के बाद से बैराज का रखरखाव नहीं किया गया है। नियमानुसार हर वर्ष बरसात के मौसम के बाद बाढ़ को ध्यान में रखते हुए संरचना की मजबूती का गहराई से अध्ययन किया जाना चाहिए, लेकिन पिछली सरकार ने इसकी उपेक्षा की। भले ही कॉफ़र बांध पानी के प्रवाह को नियंत्रित करने के लिए बनाया गया था, लेकिन शुरुआत के समय शीट के ढेर को नहीं हटाया गया और अनुबंध के नियमों को तोड़ दिया गया।

सीएम रेवंत रेड्डी ने टिप्पणी की कि सरकार को सार्वजनिक धन की वसूली करने की आवश्यकता है क्योंकि पिछली सरकार ने इसका दुरुपयोग किया। 2 पावर प्वाइंट प्रेजेंटेशन देखने के बाद उन्होंने कहा कि भ्रष्टाचार का पैसा इकट्ठा करने के लिए रेवेन्यू रिकवरी एक्ट का इस्तेमाल किया जाना चाहिए। हमने मेडिगड्डा बैराज को हुए नुकसान की गंभीरता देखी है। क्या इसकी मरम्मत जाएगी या पूरे ब्लॉक को ध्वस्त कर नया निर्माण किया जाये? इस पर विशेषज्ञ समिति से चर्चा के बाद निर्णय लिया जायेगा। अनियमितता और लापरवाही बरतने वाले कुछ इंजीनियरों को बर्खास्त कर दिया गया है और जिम्मेदार लोगों के खिलाफ जांच जारी है।

सरकार पहले ही एक विशेषज्ञ समिति गठित करने का निर्णय ले चुकी है क्योंकि राष्ट्रीय बांध सुरक्षा प्राधिकरण और सतर्कता अधिकारियों ने मेडिगड्डा के साथ-साथ अन्नारम और सुंदिला बैराजों के साथ समस्याओं की पहचान की है। सीएम ने बताया कि इन पर स्पष्टता आने में थोड़ा वक्त लगेगा। साथ ही कहा कि सिटिंग जज से न्यायिक जांच के लिए हाई कोर्ट के मुख्य न्यायाधीश को पत्र लिखा है और सेवानिवृत्त जज ने जांच की पेशकश की है। सीबीआई से भी ऊंची जांच के इरादे से इस दिशा में सोचा गया है। सीबीआई जांच की मांग कर रहे बीजेपी नेता किशन रेड्डी के सवाल के जवाब में सीएम ने कहा कि क्या उन्हें कोर्ट पर भरोसा नहीं है? वरंगल आये किशन रेड्डी मेडीगड्डा को क्यों नहीं आये?

उपरोक्त तथ्यों पर विश्लेषकों का मानना है कि रेवंत रेड्डी सरकार पिछली सरकार और केसीआर परिवार के खिलाफ बड़ी कार्रवाई करने की योजना बना रही है। जल्द ही इसके परिणाम देखने को मिलेंगे।

కాళేశ్వరం : విజిలెన్స్ నివేదికలో విస్తుపోయే నిజాలు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆర్థికభారం, అప్పుల వలన నిర్దేశించుకున్న లక్ష్యంలో వచ్చిన ఫలితాలు అంతంత మాత్రమేనని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు తేల్చారు. ప్రాజెక్టుకు మొత్తం 93,872 కోట్లు ఖర్చవ్వగా ఇందులో 61,665 కోట్లు కార్పొరేషన్ పేరుతో తీసుకున్న అప్పులేనని, మరో 32,207 కోట్లను ప్రభుత్వం బడ్జెట్ నుంచి రిలీజ్ చేసిందని ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నారు. ఆయకట్టు విషయంలో కొత్తగా 19.63 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని టార్గెట్ పెట్టుకుంటే ఐదేళ్లలో 98,570 ఎకరాలు మాత్రమే సాధ్యమైందన్నారు.

కాళేశ్వరం 3వ టీఎంసీకి సుమారు 32,165 కోట్లు అదనంగా ఖర్చవుతుందని గత ప్రభుత్వం అంచనా వేసి రుణాల ద్వారా 16,669 కోట్లు, ప్రభుత్వం నుంచి 2,817 కోట్లను ఖర్చు చేసిందని సుధాకర్‌రెడ్డి వివరించారు. థర్డ్ టీఎంసీ విద్యుత్ వినియోగం, భూ సేకరణ అవసరాలకు 33,459 కోట్లు అంచనా వేయగా.. ఇప్పటికే 20,372 కోట్లు ఖర్చయిందన్నారు. మొత్తంగా కాళేశ్వరం అంచనా వ్యయం 1.28 లక్షల కోట్లకు చేరుకున్నదన్నారు. ఇప్పటివరకైన ఖర్చులో 73,500 కోట్లు 2 టీఎంసీల అవసరాలకైతే థర్డ్ టీఎంసీ కోసం 20,372 కోట్లు అయిందన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ ఘటనపై 3 రోజుల పాటు ఫీల్డ్ స్టడీ చేసిన విజిలెన్స్ అధికారులు అనేక కీలకమైన అంశాలను వెల్లడించారు. ప్రాజెక్టు ద్వారా ఏటా 180 టీఎంసీల చొప్పున నీటిని లిఫ్టు చేసి అందించాలని టార్గెట్‌ పెట్టుకోగా ఐదేళ్లలో (2019-20 నుంచి 2023-24 వరకు) మొత్తం 900 టీఎంసీలకు గాను కేవలం162.36 టీఎంసీలనే లిఫ్టు చేసినట్లు విజిలెన్స్ డిపార్టుమెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ తెలిపారు. ఆశించిన లక్ష్యంలో 18.04% మాత్రమే సాధ్యమైందన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి తొలుత 1,849 కోట్లు మాత్రమే అంచనా వ్యయం అనుకుంటే ఆ తర్వాత 2,591 కోట్లకు, చివరకు 4,321 కోట్లకు చేరుకున్నదన్నారు. మొత్తంగా 133.6% ఎక్కువగా ఖర్చయిందన్నారు.

నిర్దిష్ట ప్లాన్‌కు విరుద్ధంగా బ్లాక్ 7 నిర్మాణం జరిగిందని, దీని కాంట్రాక్టు సంస్థ ఎల్‌అండ్‌టీ అయినప్పటికీ జాయింట్ వెంచర్‌లో భాగంగా సబ్ కాంట్రాక్టుకు వెళ్ళిందని రాజీవ్ రతన్ తెలిపారు. బ్యారేజీకి 2019 జూన్ 21న ప్రారంభం తర్వాత మెయింటెనెన్స్ చేయలేదన్నారు. రూల్స్ ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలం తర్వాత వరదలను దృష్టిలో పెట్టుకుని సౌండింగ్, ప్రోబింగ్ పద్ధతిలో నిర్మాణ పటిష్టతపై స్టడీ జరగాల్సి ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు కాఫర్ డ్యామ్ కట్టినా ప్రారంభం టైంకు షీట్ పైల్స్ లాంటివి తొలగించలేదని, కాంట్రాక్టు రూల్స్ బ్రేక్ జరిగిందన్నారు.

ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వియోగం చేయడంతో వాటి రికవరీ ప్రభుత్వానికి అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లను చూశాక ఆయన మాట్లాడుతూ అవినీతి సొమ్మును రాబట్టడానికి రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించక తప్పదన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీ తీవ్రతను దగ్గర నుంచి చూశామని, దాన్ని రిపేర్ చేసి సరిపెట్టడమా? లేక మొత్తం బ్లాకును తొలగించి కొత్తదాన్ని కట్టడమా? అనేదానిపై నిపుణుల కమిటీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. అక్రమాలు, నిర్లక్ష్యంగా ఉన్న ఇంజనీర్లను కొందరిని తొలగించామని, బాధ్యులపై విచారణ కొనసాగుతున్నందన్నారు.

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకూ ఇబ్బందులు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు విజిలెన్స్ అధికారులు గుర్తించినందున నిపుణుల కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వాటిపై స్పష్టత రానికి కొంత టైం పడుతుందని సీఎం వివరించారు. సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశామని, రిటైర్డ్ జడ్జి విచారణకు ఆఫర్ ఇచ్చిందన్నారు. సీబీఐ కంటే ఉన్నతమైన విచారణ అనే ఉద్దేశంతోనే ఈ దిశగా ఆలోచించామన్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న బీజేపీ నేత కిషన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం స్పందిస్తూ న్యాయస్థానాలపై ఆయనకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. వరంగల్ వరకూ వచ్చిన కిషన్ రెడ్డి మేడిగడ్డకు ఎందుకు నిలదీశారు.

పై వాస్తవాలను బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంపైనా, కేసీఆర్ కుటుంబంపైనా పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో ప్రజలు దాని ఫలితాలను చూస్తారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X