हैदराबाद: तेलंगाना के सिंचाई और ड्रेनेज विभाग के विशेष मुख्य सचिव रजत कुमार ने कहा कि सात साल की अवधि में तेलंगाना जमीन के ऊपर और भूमिगत जल निधि के साथ फल-फूल रहा है। उन्होंने प्रशंसा करते हुए कहा कि यह तेलंगाना सरकार की ओर शुरू की गई कालेश्वरम और मिशन काकतीय योजनाओं के कारण संभव हो पाया है। यह पता चला है कि कुल 680 टीएमसी भूमिगत जल उपलब्ध है। उन्होंने बीआरके भवन में वर्ष 2022 के लिए ‘तेलंगाना डायनेमिक ग्राउंड वाटर रिसोर्सेज कंप्यूटेड’ रिपोर्ट जारी की।
इस अवसर पर रजत कुमार ने कहा कि पिछले सात सालों में तेलंगाना में भूजल के औसत स्तर में 4.26 मीटर से अधिक की वृद्धि हुई है। बताया गया है कि 83 प्रतिशत मंडलों में भूमिगत जल सबसे अधिक बढ़ा है। इसके साथ ही तेलंगाना में भूजल की कुल उपलब्धता 680 टीएमसी तक पहुंच गई है। इसी तरह 2020 की तुलना में तेलंगाना में भूजल की खपत घटकर 8 प्रतिशत रह गई है।
उन्होंने आगे कहा कि तेलंगाना के गठन के समय 3.5 प्रतिशत भूमिगत जल संसाधन था। लेकिन 2022 में यह बढ़कर 4.8 प्रतिशत हो गया है। मिशन काकतीय, कलेश्वरम लिफ्ट सिंचाई परियोजना, बड़े और मध्यम स्तर की परियोजनाओं, तालाबों को भरने और चेक डैम के निर्माण से भूजल में काफी वृद्धि हुई है।
तेलंगाना के किसानों को यह सुझाव दिया जाता है कि वे कल्याण और भलाई के लिए भूमिगत जल संसाधनों का सख्ती से उपयोग किया जाये। इसके लिए विशिष्ट उपायों की सिफारिश करने के लिए भूजल, उद्योग, कृषि और पंचायत राज विभागों के अधिकारियों के साथ एक विशेष उप-समिति का गठन किया गया है। इस अवसर पर ईएनसी मुरलीधर, भू-जल संसाधन विभाग के निदेशक पंडित मदनुरे और अन्य उपस्थित थे।
జల నిధిగా తెలంగాణ
హైదరాబాద్: ఏడేండ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణ రాష్ట్రం భూమి పైన, భూగర్భంలోనూ జల నిధులతో కళకళలాడుతున్నదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాల వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. మొత్తంగా 680 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. 2022 సంవత్సరానికి సంబంధించి ‘తెలంగాణ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కంప్యూటెడ్’ నివేదికను బీఆర్కే భవన్‌లో ఆయన శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడేండ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 4.26 మీటర్లకు పైగా పెరిగిందని తెలిపారు. భూగర్భ జలాలు అత్యధికంగా 83శాతం మండలాల్లో పెరిగాయని వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత 680టీఎంసీలకు చేరుకున్నదని తెలిపారు. అదేవిధంగా 2020తో పోల్చితే రాష్ట్రంలో భూగర్భ జలాల వినియోగం 8 శాతానికి తగ్గిందని చెప్పారు.
తెలంగాణ రా్రష్ట్ర ఏర్పాటు నాటికి 3.5శాతం భూగర్భ జల వనరులు ఉండగా, అది 2022లో 4.8 శాతానికి పెరిగిందని తెలిపారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పెద్ద, మధ్య తరహా ప్రాజెక్టుల అనుసంధా నం ద్వారా, చెరువులను నింపడం, చెక్ డ్యా మ్‌ల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. రాష్ట్రంలోని విలువైన భూగర్భ జల వనరులను తెలంగాణ రైతుల సంక్షేమం, శ్రేయస్సు కో సం కచ్చితంగా ఉపయోగించాలని సూచించారు.
ఆ దిశగా నిర్దిష్ట చర్యలను సిఫారసు చేసేందుకు భూగర్భ జలా లు, పరిశ్రమలు, వ్యవసాయం, పంచాయితీ రాజ్‌శాఖల అధికారులతో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, భూగర్భ జలవనరుల విభాగం డైరెక్టర్ పండి త్ మడ్నూరే తదితరులు పాల్గొన్నారు. (एजेंसियां)