హైదరాబాద్ : “బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి బీజేపీకి అధ్యక్షుడి అయ్యాడు. తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదు. కరీంనగర్ కు చేసింది ఏమీ లేదు. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ రావొద్దు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా గురువారం హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని కట్కూరు క్రాస్ రోడ్డు నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. హుస్నాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా. 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద తెలంగాణను సాకారం చేస్తా అనే ప్రకటిచారు.
రాజకీయంగా నష్టం జరిగిన మాట ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీ గారు తెలంగాణ కలను సాకారం చేశారు. కేసీఆర్, వినోద్ ఎంపీలు అయిన తెలంగాణ రాలే. పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీ అయి తెలంగాణ తెచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం బయ్యారం ఉక్కు కార్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులను రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ఏమైనా చేశాడా. ఈ విషయంలో పొన్నంతో చర్చకు సిద్ధమా.
బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి ని అమిత్ షా పిలిపించుకొని మూడుగంటలు కూర్చోబెట్టి ముచ్చట చెప్పిండు తప్ప చేసిందేం లేదు. ఫిరాయింపులతో తెలంగాణలో బీజేపీ విజయం సాధించలేదు. సర్దార్ సర్వాయి పాపన్న వారసులు ఈ గడ్డ మీద ఉన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 45 లక్షల బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మోదీ తెలంగాణకు ఇవ్వలేదు. రైతులకు రుణ మాఫీ చేయరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేయరు. కానీ అదానీ, అంబానీలకు రూ. 12 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ లెక్కన తెలంగాణలో మోదీ 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి.
అదే జరిగితే తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండేవి కావు. 21 కోట్ల దరఖాస్తులు వస్తే..7లక్షల 164 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంటులో నిస్సిగ్గుగా చెప్పారు. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి బీజేపీకి అధ్యక్షుడి అయ్యావు. తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదు. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ రావొద్దు.
ఈ ప్రాంతం అవసరాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను మంజూరు చేసింది. భూ సేకరణ కూడా పూర్తయింది. 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కుర్చీ వేసుకొని గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేసాడు. ఫామ్ హౌస్లో మందు ఏస్తుండు. మీకు ఇష్టం లేకున్నా మీ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాలకు విసిరేశారు. ఇంత అన్యాయం ఉంటుందా. హుస్నాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని లెక్క చేయకుండా ఈ నియోజకవర్గాన్ని సిద్ధిపేట జిల్లాలో హారీష్ రావు కలుపుకుండు.
హరీష్ రావు నీవు చేసిన ఈ పాపానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబుకు డిపాజిట్ దక్కదు. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఎవరికి దక్కదు. కానీ సతీష్ బాబు ఇంటికే కేసీఆర్ వస్తారు. కేసీఆర్ దగ్గరి మీ సమస్యల గురించి ప్రస్తావించడు. ఇటువంటి సుద్దపప్పు సతీష్ బాబు లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం లేదు. హుస్నాబాద్ అభివృద్ధి చెందాలన్నా, మీ నియోజకవర్గాన్ని కరీంనగర్లో కలపాలన్నా హుస్నాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి.
దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు..ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు.
మనమిచ్చిన బలంతోనే కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. కొడుక్కి, కూతురికి, అల్లునికి, సడ్డకుని కొడుక్కి పదవులు వచ్చాయి. కేసీఆర్ మారడు. మనమే కేసీఆర్ మార్చాలి. మిడ్ మానేరు భూములు కొల్పోయిన కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్ రావు, పెళ్లి చేసుకున్న కూతురు సౌజన్యకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. మరీ గండిపల్లి ప్రాజెక్టులో మాత్రం పెళ్లి అయిందనే కారణంతో ఆడబిడ్డలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వవా. కేసీఆర్ నీ సడ్డకుడి కొడుకు, కూతురుకు ఒక న్యాయం, గండిపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక న్యాయమా. ఎంత కాలం ఈ దౌర్భగ్యాన్ని భరిద్దాం.
2004-14 మధ్య ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దింది. కొత్త సంవత్సరంలో 2024 జనవరి 1 న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతీ పేదోడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలకు ఇస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఏడాదిలోగా ప్రభుత్వంలో ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇందిరమ్మ రాజ్యం తేవాలి.
సర్దార్ సర్వాయి పాపన్న కోట సందర్శన
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపుర్ మండలం సర్వాయిపేటలోని పాపన్న కోటను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న కాలంలో.ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించుకొని బడుగు బలహీన వర్గాలను అణచి వేస్తున్నారు. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజలు పోరాటం చేయాలి.
సర్దార్ సర్వాయి పాపన్న నివసించిన ప్రాంతాలను మైనింగ్ మాఫియాకు కట్టబెట్టాలని చూస్తే పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్ నాయకులు అడ్డుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని బహుజనులకు అందించడానికి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని, సర్వాయి పాపన్న పాలించిన ప్రాంతాలను జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుంది. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకుగాను ఆయన జీవిత చరిత్రను పాఠశాల సిలబస్ లో చేర్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
Once in Telangana, villages would be bustling with artisans & handicrafts.
— Revanth Reddy (@revanth_anumula) March 2, 2023
KCR has ruined all the professions .
This #YatraForChange is to revive the same glory.#HaathSeHaathJodo pic.twitter.com/AhBPeyifjF
ఆరు నెలల్లో గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం : రేవంత్ రెడ్డి
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గండిపల్లి ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. స్వరాష్ట్రంలోనూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులను స్వయంగా సందర్శించిన సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేశాడని మండిపడ్డారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, పూర్తి చేసేది కూడా తమ పార్టీనే అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో 70 శాతం పూర్తి అయిన ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్యాకేజ్ లు ఇవ్వకుండా నిర్వాసితుల గోసకు కారణం అయ్యారని మండిపడ్డారు. పరిహారం అడిగితే నిర్వాసితులను జైలుకు పంపుతున్నారని ఫైరయ్యారు.
కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి
హుస్నాబాద్ పాదయాత్రలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం ఉదయం కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ స్వతహాగా ముసలోడిని అయ్యానని చెబుతున్నారు కాబట్టి తమ నినాదం బై బై కేసీఆర్ అని చెప్పారు. ఆయన ఫాంహౌస్ లోనే శేషజీవితం గడపాలని సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారని విమర్శించారు. పబ్లిక్ మీటింగ్ లలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కామెంట్ చేయడం వెనుక ఇదే కారణమని అన్నారు రేవంత్. భూపాలపల్లి లో 144 సెక్షన్ పెట్టడం.. స్థానిక ఎమ్మెల్యే కుట్రలు, అక్రమాలు, భూకబ్జా, మట్టి తవ్వకాలు లాంటివి బయటపడకుండా ఉండేందుకే అని ఆరోపించారు. కేసీఆర్ కు బై బై చెప్పి, కాంగ్రెస్ కు స్వాగతం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
@ హుస్నాబాద్ కార్నర్ మీటింగ్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్..
హుస్నాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా. 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద తెలంగాణను సాకారం చేస్తా అనే ప్రకటిచారు. రాజకీయంగా నష్టం జరిగిన మాట ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీ గారు తెలంగాణ కలను సాకారం చేశారు. కేసీఆర్, వినోద్ ఎంపీలు అయిన తెలంగాణ రాలే.
పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీ అయి తెలంగాణ తెచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం బయ్యారం ఉక్కు కార్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులను రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది.
బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ఏమైనా చేశాడా. ఈ విషయంలో పొన్నంతో చర్చకు సిద్ధమా.
బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి ని అమిత్ షా పిలిపించుకొని మూడుగంటలు కూర్చోబెట్టి ముచ్చట చెప్పిండు తప్ప చేసిందేం లేదు. ఫిరాయింపులతో తెలంగాణలో బీజేపీ విజయం సాధించలేదు.
సర్దార్ సర్వాయి పాపన్న వారసులు ఈ గడ్డ మీద ఉన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 45 లక్షల బడ్జెట్లో ఒక్క రూపాయి అయిన తెలంగాణకు మోదీ ఇచ్చారా మోదీ 9 ఏళ్లలో రైతులకు రుణ మాఫీ చేయరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేయరు.
అదానీ, అంబానీలకు రూ. 12 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ లెక్కన తెలంగాణలో మోదీ 70లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. అదే జరిగితే తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండేవి కావు. 21కోట్ల దరఖాస్తులు వస్తే..7లక్షల 164 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంటులో నిస్సిగ్గుగా చెప్పారు. బండి సంజయ్ గెలిచి బీజేపీకి అధ్యక్షుడి అయ్యావు. తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదు.
ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ రావొద్దు.
గౌరెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. కుర్చీ వేసుకొని గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తానని చెప్పి గాలికి వదిలేసాడు. ఫామ్ హౌస్లో మందు ఏస్తుండు. మీకు ఇష్టం లేకున్నా మీ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారు. ఇంత అన్యాయం ఉంటుందా. హరీష్ రావు నీవు చేసిన ఈ పాపానికి సతీష్ బాబుకు డిపాజిట్ దక్కదు. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఎవరికి దక్కదు. కానీ సతీష్ బాబు ఇంటికే కేసీఆర్ వస్తారు.
కేసీఆర్ దగ్గరి మీ సమస్యల గురించి ప్రస్తావించని సతీష్ బాబు లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం లేదు. హుస్నాబాద్ అభివృద్ధి చెందాలన్నా, మీ నియోజకవర్గాన్ని కరీంనగర్లో కలపాలన్నా హుస్నాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు.
మనమిచ్చిన బలంతోనే కేసీఆర్ విలాసవంతమైన జీవితం కేసీఆర్ మారడు. మనమే కేసీఆర్ మార్చాలి.
మిడ్ మానేరు భూములు కొల్పోయిన కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్ రావు, ఆయన చెల్లెలకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చారు.
కేసీఆర్ సడ్డకుడి కొడుకు, కూతురుకు ఒక న్యాయం, గండిపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక న్యాయమా.
ఎంత కాలం ఈ దౌర్భగ్యాన్ని భరిద్దాం. 2004-14 మధ్య ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దింది. కొత్త సంవత్సరంలో 2024 జనవరి 1 న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది.
ప్రతీ పేదోడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలకు ఇస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం.
పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. సోనియామ్మ ఆశ్వీరాదంతో ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఏడాదిలోగా ప్రభుత్వంలో ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇందిరమ్మ రాజ్యం తేవాలి.