BRAOU: ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన VC సీతారామ రావు

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. కే. సీతారామ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉద్యోగులంతా విద్యార్ధి సేవలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. న్యాక్ గుర్తింపు కోసం స్వీయ అధ్యయన నివేదికను (SSR) ఇప్పటికే సమర్పించాముని మరియు విద్యార్థులకు అందిస్తున్న సేవలు, ఇతర అంశాలకు సంబంధించి న్యాక్ నుంచి వచ్చిన సర్వే ప్రశ్నాపత్రం ఇప్పటికే విద్యార్థుల ఈ-మెయిల్‌కు వెళ్లాయని, వాటికి సానుకూలంగా సమాధానం ఇవ్వాలని విద్యార్థులను కోరారు.

మన విశ్వవిద్యాలయనికి న్యాక్ గుర్తింపు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావడమే కాకుండా వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల నుండి ఆర్ధిక సహకారం పొందేందుకు, విద్యార్థులకు మరిన్ని కొత్త కోర్సులను అందించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. న్యాక్ నుంచి నేరుగా వచ్చే ఈ మెయిల్ కి తప్పనిసరిగా రిప్లై ఇవ్వాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటె తమ అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని ఉపకులపతి ఆచార్య కె. సీతారామ రావు పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎ.వి.ఎన్ రెడ్డి నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల డైరెక్టర్స్, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

REPUBLIC DAY CELEBRATIONS AT BRAOU

Hyderabad: Prof. K. Seetharama Rao, Vice-Chancellor, Dr. B. R. Ambedkar Open University today hoisted the tri-colour National Flag on the occasion of 74th Republic Day at the Campus on Thursday and addressed the Staff Members and extended Republic Day greetings. He gave a call to the employees to rededicated to the students services for improvement of the university.

He also appeal the students to answer the questions positively as the survey questionnaire e-mail received from NAAC about the services provided to the students and other aspects. He said, the NAAC recognition will not only bring international recognition to our university but also help in getting financial support from various government and non-government organizations and provide more new courses to the students. He stated that it is mandatory to reply to this mail from NAAC and if there is any problem students may contact their study center.

Dr. A.V.N. Reddy, Registrar, BRAOU also addressed the Staff after unfurling the National Flag at BRAOU Non-Teaching Employees’ Association premises at the campus. All Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of various Service Associations also participated in the Republic Day Celebrations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X