హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరగనుంది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి రోజు ప్రసంగించనున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం చరిత్రలో ఇదే తొలిసారి కాబోతోంది.
బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే 30 రోజులకు పైగా జైలు జీవితం గడిపే సీఎంలు, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు పెద్ద పీట వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. (ఏజెన్సీలు)
संसद का बजट सत्र
हैदराबाद : संसद का बजट सत्र 31 जनवरी से 4 अप्रैल तक चलेगा। वित्त मंत्री निर्मला सीतारमण 1 फरवरी को अपना लगातार आठवां बजट पेश करेंगी। परंपरा के अनुसार, सत्र की शुरुआत 31 जनवरी को राष्ट्रपति द्रौपदी मुर्मू के लोकसभा और राज्यसभा की संयुक्त बैठक को संबोधित करने से होगी। इसके बाद आर्थिक सर्वेक्षण पेश किया जाएगा।
बजट सत्र दो चरणों में होगा। पहले चरण में 31 जनवरी से 13 फरवरी तक कुल 9 बैठकें होंगी। इस दौरान प्रधानमंत्री नरेंद्र मोदी राष्ट्रपति के अभिभाषण पर धन्यवाद प्रस्ताव पर चर्चा का जवाब देंगे और वित्त मंत्री सीतारमण बजट पर चर्चा का उत्तर देंगी।
इसके बाद संसद अवकाश पर जाएगी, ताकि बजट प्रस्तावों की समीक्षा की जा सके। सत्र का दूसरा चरण 10 मार्च से शुरू होगा, जिसमें विभिन्न मंत्रालयों की अनुदान मांगों पर चर्चा की जाएगी और बजट प्रक्रिया को पूरा किया जाएगा। सत्र 4 अप्रैल को समाप्त होगा। पूरे बजट सत्र में कुल 27 बैठकें होंगी।
