हैदराबाद : पेरिस पैरालंपिक 2024 अब समाप्त हो गया है। पैरालंपिक भारत के लिए शानदार रहा है। भारतीय पैरा एथलीटों ने अलग-अलग प्रतियोगिताओं में देश का नाम रोशन किया है। भारत ने इस बार कुल रिकॉर्ड 29 मेडल जीते हैं। इसमें 7 गोल्ड, 9 सिल्वर और 13 ब्रॉन्ज मेडल शामिलहैं। वहीं चीन ने पैरालंपिक में इस बार सबसे ज्यादा 220 पदक जीते हैं। यह 64 साल के इतिहास में भारत के लिए सबसे सफल पैरालिंपिक रहा है।
मेडल टैली में भारत ने 18वें स्थान पर समापन किया है। यह पहली बार है जब भारत टॉप 20 में शामिल हुआ है। पेरिस में भारत ने तीन साल पहले टोक्यो में बनाए गए अपने पिछले रिकॉर्ड को तोड़ दिया। टोक्यो में भारत ने 5 गोल्ड सहित 19 पदक जीते थे। 1960 से 2016 तक भारत ने केवल 12 पदक जीते थे, जिसमें सिर्फ चार स्वर्ण थे। 1960, 1964, 1976, 1980 में भारत के किसी खिलाड़ी ने पैरालिंपिक में हिस्सा नहीं लिया। छह बार (1968, 1988, 1992, 1996, 2000, 2008) पैरालिंपिक में भारत को एक भी मेडल नहीं मिला। टोक्यो से पहले भारत का सर्वश्रेष्ठ प्रदर्शन 1984 और 2016 में चार-चार पदक जीतना था।
पैरालिंपिक इतिहास में भारत के 60 पदकों में से 48 पदक टोक्यो और पेरिस में आए हैं। 2024 के पेरिस ओलंपिक में भारत के खिलाड़ियों ने निराशाजनक प्रदर्शन किया। इसके बाद पैरालंपिक में मिली सफलता ने भारतीय खेलों के लिए नई रोशनी दिखाई है। पेरिस में अवनी लेखरा, सुमित अंतिल, नितेश कुमार, हरविंदर सिंह, धर्मबीर नैन, प्रवीण कुमार और नवदीप सिंह ने सात गोल्ड मेडल जीते। भारत ने जूडो में अपना पहला पैरालंपिक पदक जीता, जबकि तीरंदाजी में भी अपना पहला स्वर्ण पदक जीता। (एजेंसियां)
Also Read-
పారాలింపిక్స్ 2024: టాప్-20లో భారత్
హైదరాబాద్ : పారాలింపిక్స్ 2024 క్రీడల పోటీలు ముగిశాయి. 25 పతకాలు సాధించడమే లక్ష్యంగా ఈ పోటీల్లో బరిలోకి దిగిన భారత్.. అంచనాలను అధిగమించింది. 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు గెలుపొందిన భారత్.. 29 పతకాలతో పోటీలను ముగించింది. దీంతో పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే మెరుగైన ప్రదర్శన కావడం విశేషం.
ఈసారి పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. స్విట్జర్లాండ్, బెల్జియం, సౌత్ కొరియా, టర్కీ, అర్జెంటీనా లాంటి దేశాల కంటే మిన్నగా భారత్ 2024 పారాలింపిక్స్‌లో పతకాలు గెలుపొందింది. పారిస్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్.. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే పారాలింపిక్స్‌లో టాప్-10 నిలవాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.
ఇటీవల ముగిసిన ఒలింపిక్స్ 2024లో అమెరికాకు ధీటుగా పతకాలు సాధించిన చైనా.. పారాలింపిక్స్‌లో అగ్రరాజ్యాన్ని సైతం వెనక్కి నెట్టింది. 94 స్వర్ణాలు, 74 రజతాలు, 49 కాంస్యాలు సాధించిన చైనా.. 217 పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 47 పసిడి పతకాలు సహా 120 పతకాలు సాధించి గ్రేట్ బ్రిటన్ రెండో స్థానంలో నిలవగా.. 36 స్వర్ణాలు సహా మొత్తం 103 పతకాలు సాధించిన అమెరికా మూడో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు టాప్-10లో నిలిచాయి.
జావెలిన్ త్రో ఎఫ్41 విభాగంలో స్వర్ణం గెలుపొందిన నవదీప్ సింగ్ భారత్‌కు 29వ పతకాన్ని అందించాడు. ఎత్తు తక్కువగా ఉండే అథ్లెట్ల విభాగంలో పోటీ పడిన నవదీప్ వాస్తవానికి రజతం గెలిచాడు. కానీ ఇరాన్ పారాలింపియన్ సదేగ్ బెయిట్ సయాహ్ డిస్‌క్వాలిఫై కావడంతో.. నవదీప్ స్వర్ణానికి అప్‌గ్రేడ్ అయ్యాడు.
ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 తేదీల మధ్య జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. మొత్తం 12 విభాగాల్లో మనవాళ్లు పోటీ పడ్డారు. 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే మూడు విభాగాల్లో అదనంగా మన వాళ్లు పోటీ పడ్డారు. అవనీ లేఖరా భారత్ తరఫున పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళా షూటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. జావెలిన్ త్రోలో తన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న సుమిత్ యాంటిల్.. పారాలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష అథ్లెట్‌గా నిలిచాడు. (ఏజెన్సీలు)