ENTERTAINMENT:’మంచి’ ర్యాల నుంచి ఆఘటనా ఘటనా దర్శకులోస్తున్నారు, వీరే వారు

రాజకీయం, శాస్త్ర అధ్యయనం, కళలు, మతం, ఏ రంగంలో క్రృషి చేయాలన్న మనుషులు మొదట తినాలి, తాగాలి, వారుండటానికి ఇల్లు, దుస్తులు కావాలి. ఈ భౌతిక అవసరాలు తీర్చడానికి వాళ్ళు ఉత్పత్తి చేసిన క్రమంలో ఆర్థిక ప్రగతి జరిగింది. దాని ఆధారంగానే రాజ్యాంగ సభలు, చట్టం గురించి అభిప్రాయాలు, కళలు, మతం భావనలు అంకురించాయి. అదే పరిణామక్రమం.

ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి కొత్తగా మంచి సినిమాలు వైపు అడుగులు తీసే దర్శకులు ఈమధ్యనే హవ చాటుతున్నారు. శ్రమ, స్వప్నం, ఆశలు, ఆశయాలు వారు నిలడటానికి చేసే ప్రయత్నం సాంస్కృతిక పునరుజ్జీవనమే వారందరిది. వారి గురించి వివరంగా, క్లుప్తంగా, సూటిగా అందరికి తెలియజేయాలనేది ఉండేది. అది ఈ రోజు రాయడానికి వీలుకుదిరింది. సంగీత, చిత్రకళాకారులు, రంగస్థల నాటక, సినిమా నటులు కొత్తగా ఆవిష్క్రతమవున్న ఆలోచనల కళారంగాలు ప్రాంతీయంగా, కొత్తరూపాలుగా బలపడేందుకు మరియు పునాదులడానికి దోహదమవుతుంది. అందులో సినిమా కూడా ఒకటి.

మనుషులు విధ్వంసం అవుతున్న చోట, లోలోపల కాలుతున్న కుళ్ళిపోయిన శవాలుగా కంపునింపుకుని తిరుగుచున్న చోట, కళలు పువ్వులుగా పూయడం మహాదనందమే కదా! పెద్ద ముప్పు విపత్తు కరోనా తర్వాత ఆర్ట్ కొంచెం మనుషులలో వికాసంగా మారాలి అప్పుడే ఈ జీవితానికి అర్థం, పరమార్థం. కొందరు తమ కళలో భిన్నత్వం కనబరుస్తారు అంటే కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తారు దీన్నే “నవ్యత” అంటుంటాము. సహజ ప్రతిభ గలిగిన వీరు సాంస్క్రృతికంగా మొలకెత్తడానికి ఎరువులుగా మారబోతున్నదనేది నిజం. స్వీయ ప్రతిభ గలిగిన వారి ఔన్నత్యం గురించి కొన్ని ముచ్చట్లు చెబుతాను.

READ ALSO:

సినిమా అనేది ద్రృశ్య మాధ్యమం అనేక కళలు సమాహారం. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చేయగలదోక్కటే. ఏ సినిమాకైనా దర్శకుడు ప్రధానం. ఈయన కలగన్న ప్రపంచం రూపుదిద్దుకుంటుంది. వేల దశాబ్దాలుగా భారతదేశంలో సినిమాను నడుస్తుంది. హిందీలో బాలీవుడ్ ఇండస్ట్రీ, తెలంగాణలో చిత్రపరిశ్రమ దర్శకుడు చూపుల నుంచి సినిమా తయారు అవుతుంది.

Ravi teja, Asst Director, pramadya

తెలంగాణ సినిమా, ఉత్తర తెలంగాణ నుంచి సినిమారంగంలో దర్శకులు అన్నమాట పూర్తిగా వినబడేది కాదు. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరీ భూతద్దం పెట్టిన వెతికినా దొరికేటి పరిస్థితి లేదు. అనేక దశాబ్దాలుగా రైతాంగం, కార్మికులు మరియు ఆదివాసీ లో నుంచి ప్రతిభ గల స్రజన్మాత్మకత ఉన్నగానీ, అవగాహన, ఆచరణ, ఆర్ధిక వనరులు సమకూర్చుకునేది తెలియక సాంస్కృతిక కళారంగం అది ఊరు వాడు వరకే ఉంది. ఇప్పుడది ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేలా కష్టపడి విజయం సాధిస్తున్నారు ఈనాటి యువ దర్శకులు. అది మనకు చాలా గర్వకారణం. అందులో కొందరు దర్శకులు పరిచయం చేస్తున్నాను.

మున్నంగి రూపక్ రోనాల్డ్ సన్ (తండ్రి సింగరేణి కార్మికుడు, రామక్రిష్ణ పూర్, మంచిర్యాల)

చిన్నతనం నుంచే కళారంగం స్టేజీ మీద నాటకాలు, పాటలు తన తండ్రితో వేదికలు పంచుకునే వాడు. అలా కళారంగం వైపు ఆకర్షితులయ్యారు. ఫిల్మ్ కోర్సు చదివిన తర్వాత ఎడిటింగ్ అన్ని రకాల సినిమా క్రాఫ్ట్ ప్రావీణ్యం సంపాదించాడు. 2016 నుంచి ఒక కథ తాను పుట్టిన పెరిగిన సింగరేణి మనుషులు కథ రాసుకొని ఇండిపెండెంట్ సినిమా తీయాలనుకున్నాడు‌.

రామక్రిష్ణ పూర్ సుమారు 2020 సినిమా పరేషాన్ మొదలు పెట్టి యాభై ఆరు రోజులు షూటింగ్ కంప్లీట్ చేయగా, మంచి విజయం సాధించాడు. అందులో అనేక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయడానికి అందరు ముందుకు వస్తారు, కానీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఆర్థిక వనరులు, నటీనటులు మరియు టెక్నికల్ సమస్యలు చాలా ఉంటాయి. వాటిని తలమీద మోసుకొని గ్రౌండ్ రియాలిటీని చూపించాలని కలలు గన్నాడు ప్రపంచాన్ని తయారు చేసి ఈ మధ్యనే “పరేషాన్” దర్శకుడు.

తను జీవించిన కాలంలో మనుషులు, జీవితాలు అల్లకల్లోలం, హాస్యం, ట్రాజెడీని ప్రాంతీయ మనుషుల్లోని నటనను చాలా సహజంగా తీర్చిదిద్ది సింగరేణి ప్రాంతంలో తల్లి తండ్రుల హాస్యపు సినిమాను తెరకెక్కించి మొదటి సినిమాతోనే క్రిటికల్ ఆక్లైమైడ్ అయ్యారు. ‘జోసునా ఉస్క భళా జో నా సునా ఉస్కా భళా’ (ఎవరు విన్నారో వారికి మంచి కలుగు గాక ఎవరు వినరో వారికి మేలు కలుగు గాక) వాస్తవికతను ప్రభావితం చేయడమే కళా ప్రయోజనం చూపించాడు.

సురేష్ నరెడ్ల (తండ్రి సింగరేణి కార్మికుడు)

ఈ యంగ్ ఫిల్మ్ మేకర్ చదువు అంతా మంచిర్యాలనే. చాలమందికి సినిమా తెలుసు గానీ ఈ దర్శకుడు తెలువదు. ప్రేమా కథా, బస్ స్టాప్ మరికొన్ని సినిమాలకు అసిస్టెంట్ చేశాక తను స్క్రిప్ట్ రాసుకుని దర్శకుడుగా మారాలని రెండు సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. చివరికి సితార బ్యానర్ నుంచి ఒకే అయ్యింది. “ఇంటింటి రామాయణం” గా సినిమా చేశాడు. తెలంగాణ కుటుంబాలు ఒక డ్రామాను బాగా తీశాడు. జూన్ తొమ్మిదవ తేదీన ధియేటర్లలో రిలీజ్ ఆ తర్వాత ఓటిటి ఆహాలో మంచి గుర్తింపు వచ్చింది. తెలంగాణ గ్రామీణ జీవితంలోని ఒక కామెడీని తెరపైన చూపించి విజయవంతమైండు. ఇది అంతా ఊరికే రాలేదు. దీని వెనుక పదిసంవత్సరాల కృషి ఉంది. ఇపుడు మరోక సినిమా దర్శకత్వం పనిలో ఉన్నాడు.

గోవిందరాజు కొడప

ఇతనికి స్టోరీ చెప్పే ఇంట్రెస్ట్ కారణంగా ఫిల్మ్ ఆర్ట్స్, పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఫిల్మ్ విద్యనభ్యసించినాడు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ “గోల్డెన్ మ్యాంగో” మరాఠీ పదినిముషాలు నిడివితో 2013 లో ఫిల్మ్ చేయగా పదిహేడు దేశాల్లో ప్రదర్శన జరిగింది. ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డు పొందింది‌. సరస్ షార్ట్ ఫిల్మ్ మరాఠీ భాషలో ఇరవై నిమిషాల నిడివితో 2016 తీసారు ఇది కూడా నామినేషన్ అవార్డ్స్ పొందింది‌. ప్రతిష్ఠాత్మక బెర్లిన్ అవార్డ్ ఎంపికైన సినిమా. తెలంగాణలో అతి తక్కువగా అది ట్రైబల్ కుటుంబాలు నుంచి పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ చదివిన అత్యంత ప్రతిభ గల దర్శకుడు. ప్రపంచ సినిమాల మీద పూర్తి అవగాహన ఉన్నా మంచి ఇలాంటి వారు భవిష్యత్తులో ఇండిపెండెంట్ మరియు రీజినల్ ఫిల్మ్ తెలంగాణ గొప్ప స్థానం తీసుకువస్తారు.

లక్ష్మణ్ మేనేని (లక్షేట్టిపేట)

సాప్ట్వేర్ కొలువుని వదిలి “మ్యాడ్ Marriage and divorce” చిత్రంతో దర్శకుడు పరిచయం అయినారు. ఇప్పుడు మరొక సినిమాతో ముందుకు వస్తున్నారు. తన ఊరు మొదేలా బ్యానర్ స్థాపించి అదే పేరు మీద సినిమాలు చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్.

ఆనంద్ కార్తీక్

మంచి కథా రచయిత, ఈ మధ్యనే “సేవ్ టైగర్” వెబ్ సీరీస్ డైలాగ్స్ మరియు కథ అందించారు. త్వరలో దర్శకుడు కావాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. కథలు మంచిగా రాయడం పట్టున్న ఆలోచనాపరుడు ఈయన లక్షేట్టిపేట.

పెన్యాల రాజ్ కుమార్

ఈయన జాతి రత్నాలు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ చేసాడు. ఇప్పుడు తన ఇండిపెండెంట్ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాడు.

అప్పని శ్రీకాంత్ వర్మ

అప్పని శ్రీకాంత్ వర్మ, సొంతూరు లక్ష్మిపూర్ గ్రా।। లక్షెట్టిపేట మం।। సదువు అంతా మంచిర్యాల, హైదరాబాద్ ల అయింది. చిన్నప్పటి కెళ్లే సినిమాల మీద బాగా ఇష్టం ఉంటుండే. బిటెక్ సదువంగ యుట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ చేసుండే. అట్ల చేసుకుంటా సోపతులు పెరిగి, 2022 ల విడుదల అయిన సమ్మతమే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన. రచన, దర్శకత్వం యే కాకుంటా ఎడిటింగ్ మీద కూడా పట్టు ఉన్నది. ఇపుడు అయితే తెర మీదికి ఎక్కిచ్చుటానికి మన మాంచిర్యాల నేపథ్యం ల రెండు కథలు పట్టుకొని తిరుగుతాన్నాడు.

బోమ్మ వేణుగౌడ్, మామిడి పల్లి (ఆర్ జీ వి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు)

మానవ నాగరికత చరిత్రకు ప్రతిపూట రక్తఆక్షర మారణహోమం నియంతలు ఆజ్ణాపింఛారు. ప్రజలూ వాళ్ళకు తలవంచారు. తెలంగాణ సాయుధపోరాటం సంబంధించిన చివరి అంకం ఇది దాని పేరే “ఏడుతరాల యుద్ధం” సెప్టెంబర్ పదిహేడు తేదీన వేణు ఉడుగుల వాయిస్ ఓవర్ ఇచ్చిన ఒక చిన్న ఫిల్మ్ గ్లింప్సెస్ వదిలాడు. మంచి స్పందన వస్తుంది. ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్, మంచి భవిష్యత్తు ఉన్న దర్శకుడు.

Dulam satyanarayana, Documentaries

ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి త్వరలో మరికొందరు దర్శకుడు అవతారం ఎత్తడానికి తయారుగున్నారు అందులో రవితేజ సిరిపురం, ప్రశాంత్ కొప్పుల, కిరణ్, రవీంద్ర సిద్దార్థ్, సురేష్ అందే… వీరంతా కొత్త సినిమా ప్రపంచంలో కొత్త కళాసంస్క్రతి అందిస్తారు. ఇంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారన్న సంగతి తెలియదు‌. ఈ ప్రాంతంలో తీసిన సినిమాల చిత్రాలకు కూడా ఇక్కడే ప్రదర్శన చేసి వాటిమీద ప్రతివిభాగంలో చర్చ, క్రిటిక్ మరియు అవగాహన కార్యక్రమం జరిగాలి. సినిమాల మీద ఒక హైదరాబాద్ కేంద్రంగానే అవగాహన ప్రోగ్రాం జరుగుతున్నాయి. జిల్లాలో కొత్తగా రూపుదిద్దుకున్న సినిమా సంస్కృతిని, ఫిల్మ్ సొసైటీ ఆక్టివేట్ చేయాలి. ఎక్కడైతే కళలు ఉంటాయో ఆ జాతి మనుగడ ఉంటుంది.

– అక్కల చంద్రమౌళి, సినిమా గీతరచయిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X