హైదరాబాద్ : సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ (కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్) కళాశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయ అధికారి డాక్టర్ నాయకంటి మద్దయ్య మాదిగ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిశాయి.

ఇందులో భాగంగా 14 వ తారీకు నుంచి ఈరోజు వరకు బుక్స్ ఎగ్జిబిషన్, గ్రంధాలయ అవగాహన ర్యాలీ, క్విజ్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి. ఆయా పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ఇవ్వబడ్డాయి.

ఈ సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రంథాలయ ఉత్సవాలు లైబ్రేరియన్ డాక్టర్ మద్దయ్య మాదిగ అద్భుతంగా నిర్వహిస్తున్నారని విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని గ్రంధాలయాల్లో లభించే పుస్తకాలు పోటీ పరీక్షల పుస్తకాలు మొదలు వాటిని ఉపయోగించుకుని విజ్ఞానాన్ని పెంచుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు.

అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన పోటీ పరీక్షలకు పుస్తకాలు నిరంతరం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని విద్యార్థులకు తెలియజేశారు.

Alsol Read-

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు డాక్టర్ నాయకంటి మద్దయ్య మాదిగ మాట్లాడుతూ విద్యార్థులకు గ్రంథ పఠనం గ్రంథాలయాలకు నిరంతరం ఉపయోగించుకునే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కళాశాల గ్రంథాలయం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని విద్యార్థులకు కావలసిన పాఠ్యపుస్తకాలు పోటీ పరీక్ష పుస్తకాలు వార్తాపత్రికలు నవలలు జీవిత చరిత్రలు ఆటోబయోగ్రఫీలు మొదలగు అన్ని కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని విద్యార్థులు యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకొని మంచి మంచి ఉన్నత స్థితికి చేరాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

