న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ని ఆహ్వానిస్తాము- సమస్యలు ఉన్నాయి: ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి

• విద్యా విధానంలో సమూల మార్పులు జరగాలి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ.బి.జె. రావు
• విశ్వవిద్యాలయాకు యూజీసీ నిధులు రావట్లేదు: ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొ.డి.రవీందర్

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సి.ఎస్.టి.డీ) ఆధ్వర్యంలో “నూతన విద్యా విధానం – 2020 అమలు : ముందుకు వెల్లడం” అనే అంశంపై శుక్రవారం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో జాతీయ సదస్సును ప్రత్యక్ష మరియు వేబినార్ మోడ్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. ఆర్. లింబాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొ. ఆర్. లింబాద్రి మాట్లాడుతూ… 21 వ శతాబ్దికి అవసరమైన విధానాలను నూతన విద్యా విధానం-2020 లో రూపొందించారని పేర్కొన్నారు. విద్యార్ధికి ఉపయోగపడేలా విద్యార్ధి అవసరాలే లక్ష్యంగా రూపొందించారని పేర్కొన్నారు. అయితే ప్రైవేటు విశ్వవిద్యాలయాల విషయంలో సమస్యలు రానున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబల్ విశ్వవిద్యాలయాలు వస్తున్న నేపధ్యంలో పేద వర్గాల విద్యార్ధులకు ఇబ్బందులు తప్పేలా లేదన్నారు. రిజర్వేషన్స్ అమలు, ఉప కార వేతానాల అమలు ఉండకపోవచ్చని తద్వారా ఆయా వర్గాలకు నాణ్యమైన ఉన్నత విద్య ఏమేరకు అందనుందో వేచిచూడాలని ఇలాంటి సమయాలకు పరిష్కారాలను వెతకాల్సిన అవసరం ఉందన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. డి. రవీందర్ మాట్లాడుతూ… రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేక భారీ సంఖ్యలో ఖాళీలు పేరుకు పోతున్నాయని ఇలాంటి సమయంలో నాణ్యమైన విద్యావిధానం, “నూతన విద్యా విధానం-2020 అమలు, మరో వైపు న్యాక్ గుర్తింపు తప్పని సరి అంటూ ఆంక్షలు విధించడం విశ్వవిద్యాలయాలను ఒత్తిడికి గురిచేయడమే అన్నారు. ఒకవైపు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు ఉస్మానియా వంటి చారిత్రక నేపధ్యం ఉన్న విశ్వ విధ్యాలయానికే యూజీసీ నుంచి నిధులు రావడం లేదని ఇలాంటి సమయంలో తీవ్రమైన నిధుల కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో వైపు నాణ్యమైన విద్య గురించి మాట్లాడటం కొంత ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి చర్చలు, కృషి జరగాల్సిన అవసరం ఉందని ప్రొ. రవీందర్ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామారావు మాట్లాడుతూ… తక్కువ సమయంలో అధునాతన పద్ధతుల్లో విద్యార్థికి సమగ్రంగా అర్ధం అయ్యేలా ఎలా పాఠాలు బోధించాలి అనేది అధ్యాపకులకు నిరంతర అధ్యనం, పరిశోధనల వల్లే సాధ్యం అని అభిప్రాయం పడ్డారు. ఒక వైపు సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతుంటే మరో వైపు మూస పద్ధతుల్లో విద్యా భోధన సరైంది కాదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం- 2020 కి అనుగుణంగా అధ్యాపకులు నైపుణ్యం సాధించాలని సూచించారు. అకాడమిక్ బ్యాంకు అఫ్ క్రెడిట్ లాంటి సిస్టం అందుబాట్లోకి వచ్చాక విద్యా విధాన పద్ధతులే మారిపోతాయని ఇది రానున్న రోజుల్లో విద్యార్ధులకు ఉపయోగకరంగా మారనుందని పేర్కొన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిందని అయితే అమలులో వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరగాలని సూచించారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇంచార్జ్ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఇ. సుధా రాణి మాట్లాడుతూ ప్రపంచీకరణలో భాగంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రూపొందించబడిందని విద్యార్ధి తాను ఎంచుకున్న కోర్సును నచ్చిన విద్యా సంస్థలో చదివే అవకాశం ఉందన్నారు.

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. బీ. జే. రావు ముఖ్య వక్తగా హాజరయ్యారు. “రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో NEP-2020 అమలు: సమస్యలు మరియు సవాళ్లు” పై ఆయన ప్రసంగించారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ని అమలు చేయాల్సిందే అని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యావిధానం సరిగ్గా లేదని సరికొత్త ఆవిష్కరణలకు సాధ్యపదట్లేదని పేర్కొన్నారు. ప్రపంచంలో 5వ ఆర్ధిక వ్యవస్థగా ఎదిగినా ఇప్పటికీ భారత దేశంలో ప్రజల అవసరాలకు తగ్గట్లు వస్తు ఉత్పత్తి జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న దేశాలు తమ ఉత్పత్తులను భారత్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తూ ఆర్ధికంగా లభ్ది పొందుతున్నాయని, చైనా లాంటి దేశం స్వయం సమృద్ధి సాధించిందని ఆ దిశగా మన దేశం వెళ్ళాలి అంటే విద్యావిధానంలో నే సమూల మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అంటే మన విద్యా విధానంలోనే లోపం ఉందని దాన్ని సరి చేసే ప్రక్రియనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని వివరించారు.

నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET), న్యూఢిల్లీ చైర్‌పర్సన్, విశ్రాంత ఐ.ఎ.యస్, డా. నిర్మల్ జీత్ సింగ్ కల్సి “అడాప్షన్ ఆఫ్ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌ వర్క్”పై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాల అమలు విశ్వవిద్యాలయాలు తీసుకోవాల్సిన చర్యలు సమస్యల పరిష్కారానికి regulatory బాడీస్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

కార్యక్రమానికి సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవర్ మాట్లాడుతూ… సదస్సు నిర్వహణ ఆవశ్యకతను, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు, ఉపయోగాలు తక్షణ చర్యలు ఎదురుకానున్న సమస్యల గురించి వివరించారు. కార్యక్రమoలో పలు విభాగాల డైరెక్టర్స్, డీన్స్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

WELCOME THE NEW EDUCATION POLICY 2020 – THERE ARE PROBLEMS: Prof. R. Limbadri, Chairman, TSCHE

·       There should be radical changes in the education system: Prof. B. J. Rao, VC UoH

·       The university does not receive UGC funds: Prof. D. Ravinder, VC OU

Hyderabad: Centre for Staff Training and development (CSTD) of Dr. B. R. Ambedkar Open University (BRAOU), organized a Seminar on “Implementation of New Education Policy-2020: A Way Forward” for teachers and research scholarsat its campus on Friday at the campus.

Prof.R.Limbadri, Chairman, State Council of Higher Education, Telangana state was the chief guest for the program. Prof.Limbadri said the necessary policies for the 21st century have been formulated in the “New Education Policy-2020. It is stated that the aim is to make the student’s needs useful. However, he expressed concern that problems will come in the case of private universities. He said that in the context of the coming of global universities, the students of the poor communities are not going to face difficulties. He said that there is a need to find solutions for such times as there may be no implementation of reservations and sub-salaries so that the respective communities will get quality higher education.

Sri.Navin Mittal, IAS, Commissioner, Collegiate & Technical education & Principal Secretary  (Revenue, Registration, Stamps & Excise & CCLA) attended as guest of honour for the program.

Prof.D.Ravinder, Vice-Chancellor, Osmania University, Hyderabad, said that there is a huge number of vacancies or appointments in state and central universities at a time like this, quality education system, “implementation of new education policy-2020, on the other hand imposing restrictions saying that NAAC recognition is wrong is to put pressure on the universities. On the one hand, they are suffering from shortage of staff and on the other hand, a university with a historical background like Osmania University is not receiving funds from the UGC, and there will be a serious shortage of funds at such a time. Prof .Ravinder believes that there is a need for discussions and efforts to solve such problems.

Prof K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU preside over the program. Prof.Rao said that how to teach lessons in advanced methods in a short time so that students can understand comprehensively is possible only because of continuous study and research. On the one hand, while technology is running, on the other hand, education in stereotyped ways is not right. It is suggested that the teachers should be skilled in accordance with the new National Education Policy – 2020. He said that once the system like Academic Bank of Credit is introduced, the education system will change and it will become useful for the students in the coming days. It was suggested that the New Education Policy 2020 has been designed in accordance with the modern needs but efforts should be made to solve the implementation problems.

Prof.E.Sudharani, Director Academic I/c, said in the program that New Education Policy 2020 has been formulated as a part of globalization so that the student can study the course of his choice in the educational institution of his choice.

Prof.B.J.Rao, Vice-Chancellor, University of Hyderabad, Telangana was the keynote speaker. He addressed on “Implementation of NEP-2020 in State Universities : Issues and Challenges”. It has been mentioned that the New Education Policy 2020 has to be implemented whether one likes it or not. It is said that the current education system is not good and new innovations are not possible. He expressed his concern that despite being the 5th largest economy in the world, the production of goods in India has not kept pace with the needs of the people. He said that small countries are getting economic benefits by exporting their products to countries like India, and a country like China has achieved self-sufficiency and our country should go in that direction, which means that the time has come for radical changes in the education system. He explained that the New Education Policy 2020 is the process of correcting the flaw in our education system.

Dr.Nirmaljeet Singh Kalsi, (Retd.) IAS, Chairperson, National Council for Vocational Education and Training (NCVET), New Delhi Spoke on “Adaption of National Credit Framework”. She said the regulatory bodies will be available to solve the problems of the implementation of central government policies by the universities.

Prof.I. Anand Pawar, Director CSTD and Seminar Director, explained the need for holding the Seminar, the implementation of New Education Policy- 2020, and the problems to be faced by immediate measures. All the Teaching staff and research scholars, Directors, Heads of the Branches, Deans attended the program.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X