हैदराबाद: तेलंगाना में चुनावी गर्मी धीरे-धीरे बढ़ती जा रही है। इस चुनाव में 3.17 करोड़ मतदाता अपने मताधिकार का प्रयोग करने वाले है। हालाँकि, मतदाता सूची में त्रुटियाँ हैं। जीएचएमसी में 20,000 लोगों की मौत हो चुकी हैं, लेकिन उनके नाम अब भी मतदाता सूची में हैं। गौरतलब है कि इनमें से कुछ की कई साल पहले मौत हो चुकी है, लेकिन उनके नाम अभी भी मतदाता सूची में दर्ज हैं। यह बात तब सामने आया जब जीएचएमसी के अधिकारी राजनीतिक दलों के प्रतिनिधियों से बात कर रहे थे। चिंता है कि इन वोटों का दुरुपयोग हो सकता है।
हैदराबाद के बहादुरपुरा में रहने वाले रागेल्ली परिवार को लें तो उस परिवार के ललितम्मा, मनोहर और राधिका की 2021 में कोविड के दौरान मौत हो गई। लेकिन वोटर लिस्ट में इन तीनों का नाम देख परिजन हैरान रह गये। इस पर प्रतिक्रिया व्यक्त करते हुए संतोष ने कहा, “कोविड-19 के कारण 9 महीने के भीतर मैंने अपनी मां, भाई और पत्नी को खो दिया। जब चुनाव अधिकारी हमारे घर आये तो उनमें से मेरे बेटे ने तीनों की मौत हो जाने की जानकारी दी और उनके नाम मतदाता सूची से हटा देने का आग्रह किया।” संतोष ने आगे कहा, “जीवित लोगों के नाम मतदाता सूची से हटाए जा रहे हैं। मृतकों के नाम नहीं हटा रहे है। हमने चुनाव अधिकारियों को जानकारी देकर अपना काम कर दिया है। मृतकों के नाम हटाना उनका काम है। मृत परिवार के सदस्यों के नाम पर कोई और वोट डाल सकता है।”
शमशीगुडा निवासी बानुर रामुलु की तीन साल पहले मृत्यु हो गई। लेकिन गौर करने वाली बात यह है कि उनका नाम अभी भी सेरिलिंगमपल्ली निर्वाचन क्षेत्र की मतदाता सूची में है। रामुलु की पत्नी ने कहा कि उन्होंने अपने पति की मौत का मामला अधिकारियों के ध्यान में लाया। कहा जा रहा है कि कई मृत लोगों के नाम भी वोटर लिस्ट में हैं। इस पर कांग्रेस नेता मोहम्मद फिरोज खान ने कहा कि उन्होंने मतदाता सूची में मृत व्यक्तियों के नाम के मुद्दे को चुनाव आयोग के ध्यान में लाया है। उन्होंने यह भी कहा कि 1995 से अब तक 2704 मृत मतदाता हैं। चुनाव अधिकारियों ने बताया कि मृतकों के नाम मतदाता सूची से हटाने की प्रक्रिया शुरू कर दी है।
फ़िरोज़ खान ने कहा कि जीएचएमसी रिकॉर्ड बताते हैं कि 2015 और 2023 के बीच नामपल्ली निर्वाचन क्षेत्र में 7767 लोगों की मृत्यु हुई। लेकिन उनके नाम अभी भी मतदाता सूची में हैं। उन्होंने कहा कि 7767 लोगों की मौत हुई तो केवल 1869 नाम हटाये गये। रंगारेड्डी जिले के एलबी नगर, सेरिलिंगमपल्ली, राजेंद्र नगर और महेश्वरम निर्वाचन क्षेत्रों में, 7121 लोगों की मौत हुए और 2780 नाम हटा दिए गए हैं। अधिकारियों का कहना है कि वोटर लिस्ट से नाम हटाने के लिए मृतक के परिजनों को फॉर्म-7 जमा करना होता है, तभी वे वोटर लिस्ट से नाम हटा सकते हैं। लेकिन कुछ लोगों का आरोप है कि फॉर्म-7 जमा करने के बावजूद वोटर लिस्ट से नाम नहीं हटाया जा रहा है।
హైదరాబాద్‌లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించలేదు
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఉన్న 3.17 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అయితే ఓటర్ల జాబితాలో లోపాలు వెలుగు చూస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 20 వేల మంది మరణించినప్పటికీ ఓటర్లుగా కొనసాగుతున్నారు. కొంత మంది చాలా ఏళ్ల క్రితమే చనిపోయినప్పటికీ ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉండటం గమనార్హం. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఈ ఓట్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో నివసించే రాగెల్లి కుటుంబాన్నే తీసుకుంటే 2021లో కోవిడ్ సమయంలో ఆ కుటుంబానికి చెందిన లలితమ్మ, మనోహర్, రాధిక చనిపోయారు. కానీ ఆ ముగ్గురి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండటం చూసి కుటుంబీకులు ఆశ్చర్యపోయారు. ‘‘కోవిడ్-19 కారణంగా 9 నెలల వ్యవధిలోనే మా అమ్మను, సోదరుడిని, భార్యను కోల్పోయాను. ఎలక్షన్ ఆఫీసర్లు మా ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురు చనిపోయారని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని నా కుమారుడు కోరాడు’ అని సంతోష్ తెలిపారు. ‘‘బతికున్న వాళ్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. చనిపోయిన వాళ్ల పేర్లనేమో తొలగించడం లేదు. ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చి మా పని మేం చేశాం. చనిపోయిన వాళ్ల పేర్లను తీసేయడం వాళ్ల డ్యూటీ’’ అని అని సంతోష్ వ్యాఖ్యానించారు. చనిపోయిన తమ కుటుంబీకుల పేరిట మరొకరు ఓట్లు వేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన చెందుతున్నారు.
షంషీగూడకు చెందిన బానూరు రాములు మూడేళ్ల క్రితం చనిపోయారు. కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఇప్పటికీ ఆయన పేరు ఓటర్ల జాబితాలో ఉండటం గమనార్హం. తన భర్త చనిపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రాములు భార్య తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంత మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు ఉన్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని కాంగ్రెస్ నేత ఎండీ ఫిరోజ్ ఖాన్ తెలిపారు. 1995 నుంచి 2704 మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. చనిపోయినవారి పేర్లను ఓటర్లు జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించామని ఎన్నికల అధికారులు తెలిపారన్నారు.
2015 నుంచి 2023 మధ్య నాంపల్లి నియోజకవర్గం పరిధిలో 7767 మంది చనిపోయారని జీహెచ్ఎంసీ రికార్డులు చెబుతున్నాయని ఫిరోజ్ ఖాన్ తెలిపారు. కానీ వారి పేర్లు ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఉన్నాయన్నారు. 7767 మంది చనిపోగా 1869 పేర్లను మాత్రమే తొలగించారని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో ఉన్న 7121 మంది మరణించినట్లు గుర్తించగా 2780 మంది పేర్లను తొలగించారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలంటే మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులు ఫామ్-7 సమర్పించాల్సి ఉంటుందని అప్పుడే తాము ఓటర్ల జాబితా నుంచి తొలగించగలమని అధికారులు చెబుతున్నారు. అయితే తాము ఫామ్-7 సమర్పించినప్పటికీ.. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. (ఏజెన్సీలు)