MLC By-Poll : कड़े मुकाबले में कांग्रेस उम्मीदवार तीनमार मल्लन्ना विजयी

हैदराबाद : नलगोंडा-वरंगल-खम्मम एमएलसी चुनाव में अप्रत्याशित घटनाक्रम हुआ। कड़े मुकाबले में कांग्रेस उम्मीदवार ‘Q- NEWS’ के प्रमुख तीनमार मल्लन्ना उर्फ चिंतपंडू नवीन ने जीत हासिल की है। बीआरएस उम्मीदवार राकेश रेड्डी का एलिमिनेशन हो जाने से मल्लन्ना जीत गये। दूसरे वरीयता के मतदान में राकेश रेड्डी ने मल्लन्ना को कड़ी टक्कर दी। जादुई आंकड़े तक न पहुंच पाने के बावजूद मल्लन्ना सफल रहे है।

गिनती की प्रक्रिया रोमांचक रही है। तीनमार मल्लन्ना और राकेश रेड्डी के बीच प्रतिस्पर्धा कड़ी रही है। हालाँकि, मल्लन्ना ने आगे से भी बढ़त दिखायी। बीजेपी उम्मीदवार प्रेमेंदर रेड्डी किसी भी राउंड में टक्कर नहीं दें सके। अंत में, राकेश रेड्डी के निष्कासन के कारण चुनाव अधिकारी ने घोषणा की कि तीनमार मल्लन्ना जीत गये हैं।

संबंधित खबर-

తీన్మార్ మల్లన్న విజయం

హైదరాబాద్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం జరిగింది హోరా హోరాగా జరిగిన పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్‌ కావడంతో ఆయన విజయం సాధించారు. రెండో ప్రధాన్యత ఓటులో మల్లన్నకు రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోయినా మల్లన్న విజయం సాధించారు.

ఇక కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. తీన్మార్ మల్లన్న, రాకేశ్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయినా సరే ముందు నుంచీ కూడా మల్లన్న ఆధిక్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్‌లోనూ ఇవ్వలేకపోయారు. చివరకు రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతో తీన్మార్ మల్లన్న విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

ఓటమిపై రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మరోవైపు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. గత రెండు రోజులుగా సాగుతోన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ముగిసింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మల్లన్నకు చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఓటమి అనంతరం రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటమిని అంగీకరిస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికలో సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతికంగా గెలిచానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుండి బరిలోకి దిగారు. బీజేపీ తరుఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలోకి దిగగా, అశోక్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అశోక్ సార్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. గత నెల 27న ఈ ఎన్నిక జరగగా.. తాజాగా దీనికి సంబంధించిన ఫలితం వెలువడింది. తీవ్ర ఉత్కంఠలో చివరికి కాంగ్రెస్ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X