“దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమ పథకాల తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం”

వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

హైదరాబాద్ : హనుమకొండ జిల్లా, కమలాపురం మండలం గూడూరు గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం చేరుకున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఆయనకు ఘన స్వాగతం పలికిన నాయకులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ కె. రంగనాథ్ తదితరులు.

కమలాపురం మండల కేంద్రంలో 43.5 కోట్లతో నిర్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే బాలికలు, బాలుర విద్యాలయం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను, కోటి 50 లక్షలతో జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కోటి 71 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, 25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, 25 లక్షలతో అయ్యప్ప గుడి, 30 లక్షలతో పెద్దమ్మ గుడి, 30 లక్షలతో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్, 30 లక్షలతో మార్కండేయ ఆలయాలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో శంకుస్థాపనలు చేసారు. రైతు వేదిక ప్రాంగణంలో 69 లక్షల 85 వేల తో నిర్మించిన వివిధ కుల సంఘాల భవనాలను ప్రారంభించారు,

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యాసంస్కరణలు అమలు చేస్తుందని అన్నారు. విద్యా వైద్యం రైతు సంక్షేమం తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుపరచడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని, రాష్ట్ర పురోగతిని చూసి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వారి రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తారకరామారావు అన్నారు.

అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే బాలబాలికల రెసిడెన్షియల్ విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుపరచుందని పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను కొనసాగించేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన విద్య వైద్యం, రైతు సంక్షేమం, కుల సంఘాల అభివృద్ధి అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన గౌరవం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మేల్యే లు ఒడితల సతీష్ కుమార్, డాక్టర్ తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక ప్రజా ప్రతినిధులు జడ్పిటిసి, సర్పంచ్, ఎంపీపీ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట బహిరంగ సభలో మంత్రి గంగుల కమలాకర్ గారి కామెంట్స్

“బీసీల ద్రోహి కేంద్ర ప్రభుత్వం. బండి సంజయ్, ఈటల కు దమ్ముంటే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లోగా బీసీ మంత్రిని ప్రకటించెలా మోదీపై ఒత్తిడి తేవాలి. ఈటల గెలిస్తే డబుల్ ఇంజన్ ద్వారా అభివృద్ది అని చెప్పి కనుమరుగయ్యారు. బీసీ మంత్రిని ప్రకటిస్తే ఈటలకు, బండి సంజయ్ కు నా చేతి బంగారు తొడుగు ఇచ్చేస్తా. విద్యకు దూరం అయిన బీసీ బిడ్డలకు విద్యను అందించిన గొప్ప వ్యక్తి కెసిఆర్. బీసీ బిడ్డను అని చెప్పుకుంటూ ఈటల రాజేందర్, బండి సంజయ్ లు బీసీలను మోసం చేస్తున్నారు.

తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి హుజూరబాద్ ఉప ఎన్నికల్లో గెలిపించండి అన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే..నిధుల వరద వస్తది అన్నారు..నిధుల సంగతి కాదు కదా కనీసం ఎంపీ సంజయ్ కనీసం ఇటు వైపు కూడా రాలే. ఎన్నికల్లో ఓడిన గెల్లు శ్రీనివాస్,పాడి కౌశిక్ లు జనాల్లో ఉంటే..గెలిచిన ఈటల, బండి సంజయ్ లు కనుమరుగయ్యారు. కేంద్రానికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మా బీసీ బిడ్డలకు నిధులు ఎందుకు ఇవ్వరు. అసలు బీసీ కి మంత్రి ఉంటే కదా కేంద్రం ఇచ్చేది.

మోదీ, ఈటల, బండి ముగ్గురు బీసీ లే అని చెప్పుకుంటున్నారు కదా. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ మంత్రి నీ, ఈ బడ్జెట్ లో నిధులనీ ప్రకటించాలి. అలా చేస్తే తన చేతికి ఉన్న బంగారు తొడుగు ఈటలకు, బండి కి తొడుగుతా అని సవాల్ విసురుతున్నా. అప్పటి వరకు వారు బీసీ ద్రోహులుగానే మిగిలిపోతారు. ఈ బడ్జెట్ లో బీసీ మంత్రినీ ప్రకటించాలని బడ్జెట్లో డిమాండ్ చేయకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ సత్తా చాటుతాం. వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్న కెసిఆర్ చేతులకు ప్రజలంతా బలం చేకూర్చాలి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X