हैदराबाद: मेगास्टार चिरंजीवी ने शनिवार को अहम खुलासा किया। उन्होंने कहा कि उन्हें कैंसर होने का खतरा था। पहल ही उसकी पहचा की और उपचार किया। इसीलिए बच गया। उन्होंने कहा कि वह सही समय पर अस्पताल गए और कोलोनोस्कोपी कराई। स्टार अस्पताल की ओर से आयोजित एक कार्यक्रम में चिरंजीवी ने यह खुलासा किया।
इस मौके पर मेगास्टार ने कहा, “मुझे लगता है कि मैं स्वस्थ रहूंगा। क्योंकि मैं रोजाना व्यायाम करता हूं। मैं स्वस्थ भोजन और फाइबर युक्त खाना लेता हूं। मेरे पास पोषण विशेषज्ञ हैं। मुझे लगता है कि मुझे कोई बीमारी नहीं होगी।”
चिरंजीवी ने आगे कहा कि मुझे कोई बुरी आदत नहीं है। कभी-कभी मैं दोस्तों के साथ शराब पीता हूं। धूम्रपान की कोई आदत नहीं। इसका मतलब यह नहीं है कि इससे कोई कैंसर नहीं होगा। फिर भी मैंने एआईजी अस्पताल में कैंसर का इलाज कराया। मुझे 45 साल बाद पेट के कैंसर से प्रभावित हुआ।
केवल स्टेज-4 में ही इस कैंसर का पता लगने की संभावना है। मैं एआईजी गया और डॉ. नागेश्वर राव से मिला। जांच में पॉलीप्स का पता चला। तुरंत इलाज करके उसे बाहर निकाल दिया। अगर हमें कैंसर के बारे में पता नहीं होता और हमें खुद पर विश्वास होता कि यह नहीं हो सकता, तो पता नहीं एक-दो साल बाद मेरी क्या हालत होती।
जागरूता के चलते वह अस्पताल गया और इलाज कराया। उन्होंने कहा कि वह यह कहने से नहीं डर रहे है। उन्होंने कहा कि वह प्रशंसकों के लिए कितने भी करोड़ रुपये खर्च करेंगे। हैदराबाद और जिलों में भी कैंसर स्क्रीनिंग टेस्ट किए जाएंगे। उन्होंने कहा कि कैंसर की जांच के लिए उन्होंने स्टार अस्पताल से बात की है।
चिरंजीवी ने यह भी कहा कि जीनोमिक्स टेस्ट से कैंसर का जल्दी पता लगाया जा सकता है। कैंसर के बारे में जन जागरूकता बढ़ाने के लिए कड़ी मेहनत करेंगे। मेरी अभिलाषा है कि हैदराबाद शहर कैंसर नियंत्रण का केंद्र बने।
క్యాన్సర్ ముందుగా గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకున్నందుకే బతికా: మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్యాన్సర్ బారినపడువాడినని, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. సరైన సమయంలో ఆసుపత్రికెళ్లి కొలనోస్కోపీ చేయించుకున్నానని చెప్పారు. స్టార్ హాస్పిటల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘తాను ఆరోగ్యంగా ఉంటానని అనుకుంటానని, రోజు ఎక్సైర్‌సైజ్ చేస్తుంటానని, హెల్తీఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు. నాకు ఏ జబ్బురాదులే అనుకుంటాను.
ఏ బ్యాడ్ హాబిట్స్ లేవ్. ఎప్పుడో స్నేహితులతో వైన్ తీసుకుంటాను. స్మోకింగ్ అలవాట్లు లేవు. దాంతో ఎలాంటి క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదు. అలాంటి నేను ఏఐజీ హాస్పిటల్‌లో క్యాన్సర్స్‌కు చికిత్స తీసుకున్నాను. 45 సంవత్సరాలు దాటిన తర్వాత కొలన్ క్యాన్సర్‌తో బాధపడ్డాను.
స్టేజ్-4 మాత్రమే దీన్ని గుర్తించే అవకాశం ఉంది. ఏఐజీ వెళ్లి డాక్టర్ నాగేశ్వర్‌రావును కలిశాను. పరీక్షల్లో పాలిప్స్ బయటపడ్డాయి. వెంటనే చికిత్స చేసి వాటిని తొలగించారు. క్యాన్సర్‌పై అవగాహన లేకపోయి ఉన్నా మనకు రాదులే అని మనపై మనకు నమ్మకం, నిర్లక్ష్య భావన ఉంటే ఒకటి రెండు సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు.
అవగాహన ఉండడంతో ఆసుపత్రికి వెళ్లడంతో చికిత్స తీసుకున్నారు. ఇది చెప్పేందుకు తాను భయటపడడం లేదు అన్నారు. అభిమానుల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తానన్నారు. హైదరాబాద్, జిల్లాల్లోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల కోసం స్టార్ హాస్పిటల్‌తో మాట్లాడానన్నారు.
జీనోమిక్స్ టెస్టుతో ముందస్తుగానే క్యాన్సర్‌ను గుర్తించవచ్చన్న చిరంజీవి క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్‌గా కావాలన్నారు. (ఏజెన్సీలు)