हैदराबाद: तेलंगाना में करीब दो महीने तक चला चुनाव प्रचार शनिवार शाम 6 बजे खत्म हो गया। जहां वामपंथी उग्रवाद की समस्या है उन 13 विधानसभा क्षेत्रों में शाम चार बजे तक इसे पूरा कर लिया गया। राज्य की सभी 17 संसदीय सीटों पर सोमवार (13 मई) को एक ही चरण में मतदान होगा। इसके लिए चुनाव आयोग ने सारी व्यवस्था कर ली है। पूरे राज्य में धारा 144 लागू हो गई। मौन अवधि के कारण गैर-स्थानीय लोगों को संबंधित निर्वाचन क्षेत्रों से बाहर भेजने की प्रक्रिया शुरू हो गई है। स्थानीय पुलिस ने विशेष निगरानी रखी है। गेस्ट हाउस, रिसॉर्ट, कल्याण मंडप, समारोह हॉल, होटल, लॉज आदि में निरीक्षण तेज कर दिया गया है।
मतदान प्रतिशत काफी कम होने को चुनाव आयोग ने गंभीरता से लिया है। इस बार आयोग समेत राज्य सरकार ने सभी निजी कंपनियों और उद्योगों को मतदान के दिन (13 मई) अनिवार्य अवकाश घोषित करने का आदेश जारी किया है। इसी क्रम में सीईओ विकासराज ने इस बात को गंभीरता से लिया है कि कुछ सॉफ्टवेयर और बीपीओ कंपनियों ने छुट्टियों की घोषणा नहीं की है। यह स्पष्ट किया गया है कि मतदान के अधिकार का प्रयोग करने के लिए कर्मचारियों को छुट्टी दी जानी चाहिए। वहीं, चुनाव शांतिपूर्ण कराने के लिए राज्य में अर्धसैनिक बलों की करीब 160 कंपनियां और दूसरे राज्यों से 20 पुलिसकर्मी तैनात किये जा रहे हैं। इसके अलावा राज्य में करीब 65,000 पुलिसकर्मी भी चुनाव सुरक्षा ड्यूटी पर तैनात हैं।
तेलंगाना भर में 35,809 मतदान केंद्रों की स्थापना के साथ, चुनाव आयोग उन वाहनों के लिए जीपीएस ट्रैकिंग सुविधा की भी व्यवस्था कर रहा है जो जिला केंद्रों से ईवीएम, मतपत्र इकाइयों और वीवी पैट्स और पुलिस केंद्रीय अर्धसैनिक बलों के एस्कॉर्ट का परिवहन करते हैं। रैंडमाइजेशन के माध्यम से मतदान केंद्रों को ईवीएम आवंटित करने वाले आयोग ने पहले ही लगभग 1.90 लाख लोगों को प्रशिक्षण दिया है जो सीधे मतदान कर्तव्यों में भाग ले रहे हैं और एक लाख से अधिक लोग जो अप्रत्यक्ष ड्यूटी कर रहे हैं। चुनाव ड्यूटी में भाग लेने वाले 1.88 लाख कर्मी पहले ही डाक मतपत्र के माध्यम से मतदान के अपने अधिकार का प्रयोग कर चुके हैं। लगभग 22,000 वरिष्ठ नागरिकों और विकलांग लोगों ने घरेलू मतदान के माध्यम से अपने मताधिकार का प्रयोग किया।
संबंधित खबर-
शहरी क्षेत्रों में मतदान प्रतिशत कम को ध्यान में रखते हुए कि चुनाव आयोग ने इस बार गेटेड सामुदायिक कॉलोनियों और बहुमंजिला अपार्टमेंट क्षेत्रों में 450 से अधिक सहायक मतदान केंद्र स्थापित किए हैं जहां अधिक मतदाता हैं। उन मतदाताओं को मतदान प्रक्रिया में भाग लेने और मतदान प्रतिशत बढ़ाने के लिए पहल की गई। लगभग 3.35 करोड़ मतदाताओं में से 3.20 करोड़ परिवारों को मतदाता पर्चियों का वितरण पहले ही पूरा कर लिया है। चुनाव आचार संहिता के उल्लंघन के लिए इस बार 8,600 से अधिक एफआईआर दर्ज की गई हैं, मौन अवधि के दौरान राजनीतिक दलों की गतिविधियों पर निगरानी तेज कर दी गई है।
मतदान प्रक्रिया के दौरान हिंसा की घटनाओं से बचने के लिए उपद्रवग्रस्त मतदान केंद्रों के पास विशेष सावधानी बरती गई है। प्रत्येक मतदान केंद्र पर वेबकास्टिंग अनिवार्य कर दी गई है। इसने सुरक्षा व्यवस्था भी मजबूत कर दी है क्योंकि ऐसे क्षेत्रों में 328 मतदान केंद्र हैं जहां वामपंथी उग्रवाद एक समस्या है। एक टोल-फ्री नंबर (1950) ने चुनाव नियमों के किसी भी उल्लंघन के मामले में एक सौ मिनट के भीतर शिकायतों के निवारण के लिए एक तंत्र बनाया। नकदी, शराब, सोना आदि की अवैध आवाजाही के कारण दो महीने के भीतर लगभग पुलिस ने 320 करोड़ रुपये जब्त किये। ईवीएम का निर्माण करने वाली कंपनी ईसीआईएल ने ईवीएम में खराबी आने पर तत्काल तकनीकी समाधान के लिए विशेषज्ञों को तैयार रखा है।
तेलंगाना में कुल एमपी सीटें: 17 (एससी-3, एसटी-2, सामान्य-12)
चुनाव लड़ने वाले उम्मीदवार: 525
सर्वाधिक उम्मीदवार: सिकंदराबाद (45 उम्मीदवार)
सबसे कम जनसंख्या: आदिलाबाद (12 लोग)
कुल मतदाता : 3,32,32,318
महिलाएँ: 1,67,01,192
पुरुष: 1,65,28,366
पहली बार मतदाता: 9,20,313
दिव्यांग मतदाता : 5,27,486
मतदान केंद्र: 35,809
सर्वाधिक मतदान केंद्र: मल्काजीगिरी (3,226)
क्रिटिकल मतदान केंद्र: 9,900
ऑग्जिलरी मतदान केंद्र : 453
आवश्यक मतपत्र इकाइयाँ: 1,09,941
नियंत्रण इकाइयाँ: 44,906
वीवी पैट्स : 50,135
जब्त नकदी व शराब की कीमत : 320 करोड़ रुपये
మే 13న పోలింగ్
హైదరాబాద్ : తెలంగాణలో దాదాపు రెండు నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే కంప్లీట్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకే విడతలో సోమవారం (మే 13న) పోలింగ్ జరగనున్నది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. సైలెన్స్ పీరియడ్ కారణంగా స్థానికేతరులను ఆయా నియోజకవర్గాల నుంచి బైటకు పంపించే ప్రాసెస్ మొదలైంది. లోకల్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గెస్ట్ హౌజ్‌లు, రిసార్టులు, కల్యాణమండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్ళు, లాడ్జిలు తదితరాలన్నింటా తనిఖీలు ముమ్మరమయ్యాయి.
పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుండడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు పోలింగ్ రోజున (మే 13న) విధిగా హాలీడే ప్రకటించాలంటూ కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ కొన్ని సాఫ్ట్ వేర్, బీపీవో సంస్థలు సెలవు ప్రకటించలేదన్న విషయాన్ని సీఈఓ వికాస్‌రాజ్ సీరియస్‌గా తీసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోడానికి ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రం మొత్తంమీద దాదాపు 160 కంపెనీల పారా మిలిటరీ బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది పోలీసుల్ని రప్పిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని దాదాపు 65 వేల మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లో కంటిన్యూ అవుతున్నారు.
రాష్ట్రం మొత్తం మీద 35,809 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పడంతో జిల్లా కేంద్రాల నుంచి అక్కడికి ఈవీఎంలు, బ్యాలట్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో పాటు పోలీసు కేంద్ర పారా మిలిటరీ బలగాలతో కూడిన ఎస్కార్టును కూడా ఎలక్షన్ కమిషన్ సమకూరుస్తున్నది. రాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన కమిషన్… పోలింగ్ విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దాదాపు 1.90 లక్షల మందికి, పరోక్షంగా డ్యూటీ చేస్తున్న మరో లక్ష మందికి పైగా ఇప్పటికే శిక్షణను కూడా అందజేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇప్పటికే 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ సిటిజెన్లు, దివ్యాంగులు దాదాపు 22 వేల మంది హోం ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్… ఈసారి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలతో పాటు ఎక్కువ ఓటర్లు ఉండే బహుళ అంతస్తుల అపార్టుమెంట్ల ఏరియాల్లో దాదాపు 450కు పైగా ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ ఓటర్లను పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకునేలా, పోలింగ్ శాతాన్ని పెంచేలా చొరవ తీసుకున్నది. దాదాపు 3.35 కోట్ల ఓటర్లలో ఇప్పటికే 3.20 కోట్ల మంది ఇండ్లకు ఓటర్ స్లిప్‌ల పంపిణీని పూర్తిచేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు ఈసారి 8,600కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడంతో సైలెన్స్ పీరియడ్‌లో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిఘాను ముమ్మరం చేసింది.
పోలింగ్ ప్రక్రియలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో వెబ్ క్యాస్టింగ్‌ను తప్పనిసరి చేసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాల్లో 328 పోలింగ్ కేంద్రాలున్నందున భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టం చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చోటుచేసుకున్నట్లయితే ఫిర్యాదు చేయడానికి టోల్-ఫ్రీ (1950) నెంబర్ వంద నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించే మెకానిజాన్ని రూపొందించింది. నగదు, మద్యం, బంగారం తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండడంతో రెండు నెలల వ్యవధిలో దాదాపు రూ. 320 కోట్ల విలువైనది పోలీసుల స్వాధీనమైంది. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే టెక్నికల్ పరిష్కారం కోసం వాటిని తయారుచేసిన ఈసీఐఎల్ నిపుణులను సిద్ధంగా ఉంచుకున్నది. (ఏజెన్సీలు)
మొత్తం ఎంపీ స్థానాలు : 17 (ఎస్సీ-3, ఎస్టీ-2, జనరల్-12)
పోటీలో ఉన్న అభ్యర్థులు : 525 మంది
ఎక్కువ మంది అభ్యర్థులు : సికింద్రాబాద్‌లో (45 మది)
అతి తక్కువ మంది ఉన్నది : ఆదిలాబాద్‌లో (12 మంది)
మొత్తం ఓటర్లు : 3,32,32,318
మహిళలు : 1,67,01,192
పురుషులు : 1,65,28,366
ఫస్ట్ టైమ్ ఓటర్లు : 9,20,313
దివ్యాంగ ఓటర్లు : 5,27,486
పోలింగ్ కేంద్రాలు : 35,809
ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్నది : మల్కాజిగిరిలో (3,226)
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు : 9,900
ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ : 453
అవసరమైన బ్యాలట్ యూనిట్లు : 1,09,941
కంట్రోల్ యూనిట్లు : 44,906
వీవీ ప్యాట్‌లు : 50,135
స్వాధీనమైన నగదు, లిక్కర్ : రూ. 320 కోట్లు