కర్నూలు/హైదరాబాద్ : జాతీయ విద్యా దినోత్సవం మరియు అల్పసంఖ్యాక సంక్షేమ దినోత్సవం సందర్బంగా డా. పూలాల చంద్ర శేఖర్, ఉపకులపతి, డా. ఎన్.టి.ఆర్.ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మరియు డా. యస్. ఎ. సత్తార్, విశ్రాంత సంచాలకులు, వైద్య విద్య, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లకు ‘కర్నూలు జిల్లా రత్నాలు’ గా కర్నూలు జిల్లా మేధావుల వేదిక గౌరవించనున్నరు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలలో భాగంగా జాతీయ విద్యా దినోత్సవం మరియు అల్పసంఖ్యాక సంక్షేమ దినోత్సవం నాడు ఉన్నత పాలనాధికారి, ఉత్తమ సామజిక సేవకుడు, నిత్య కృషీవలుడు, డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. పూలాల చంద్రశేఖర్ ని మరియు పరిపాలనా దక్షుడు వైద్యరంగంలో నిష్ణాతులు, కర్నూలు వైద్య కళాశాల మొదటి విద్యార్ధి అయిన డా. యస్. ఎ. సత్తార్ ను “కర్నూలు జిల్లా రత్నాలు” (Jewels of Kurnool) గా సన్మానిస్తున్నట్లు కర్నూలు జిల్లా మేధావుల కన్సార్టియం వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య యస్. మన్సూర్ రహమాన్, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు కె చంద్రశేఖర కల్కుర తెలియజేసారు.

కర్నూలు జిల్లా లోని పాలకుర్తి వాసి అయిన డా. పూలాల చంద్ర శేఖర్ 1997సంవత్సరంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ పర్వాన్ని మొదలు పెట్టి ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, అదనపు సంచాలకులు, వైద్య విద్య తదితర పదవులకు వన్నె తెచ్చి ప్రస్తుతం డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా అత్యున్నత పదవిని అలంకరించి కర్నూలు జిల్లా కీర్తిని పెంచిన మొదటి వ్యక్తి అయినారు. హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా, కర్నూలు హార్ట్ మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి స్థాపకునిగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా లోని నంద్యాల చెందిన డా యస్. ఎ. సత్తార్ 1957 లో కర్నూలు మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థి. తాను చదివిన కళాశాలలోనే 1969 వ సంవత్సరంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వృత్తిలో ప్రవేశించి ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ గా సేవలనందించి అత్యున్నత పదవి అయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్య సంచాలకులు నియమించబడిన తొలి జిల్లావాసి అయన. 1998 లో పదవి విరమణ పొందినప్పటి నుంచి గత 27 సంవత్సరాలు గా పాత బస్టాండ్ ప్రాంతములోని కింగ్ మార్కెట్ రోడ్ లోని తన క్లినిక్ లో రోగులకు సేవలందిస్తున్న అవిశ్రాంత వైద్యరత్నం యితడు.
ఇది కూడ చదవండి-
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మేధావుల కన్సార్టియం, గాడిచర్ల ఫౌండేషన్, రాయలసీమ ఎకనామిక్ అసోసియేషన్, మానవశక్తి పరిశోధన కేంద్రము, కర్నూలు జిల్లా ప్రగతి సమితి, కర్నూలు జిల్లా అభివృద్ధి వేదిక తదితర సంస్థలు పురస్కారగ్రహీతలకు అభినందనలు తెలియజేశాయి.
