ఓఆర్ఆర్ విషయంలో మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారు.
లీజు లో అవకతవకలు జరిగినట్లు భావిస్తే వెంటనే రద్దు చేయండి
ప్రభుత్వం లో ఉండి కూడా కేవలం ఆరోపణలు చేస్తున్నారంటే మీ నైజం ఏంటో అర్థవుతోంది.
హైదరాబాద్ : ఓఆర్ఆర్ లీజు విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఆరోపణలు చేస్తుండటం చూస్తుంటే జాలేస్తోంది. ఓఆర్ఆర్ లీజు ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చిన ధరకు ఓ సంస్థకు అప్పగించిందని రెవెన్యూ మంత్రి ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నిజంగానే తక్కువ ధరకు ఓఆర్ఆర్ ను లీజుకు ఇస్తే…ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది.
దమ్ముంటే వాళ్ల ఆరోపణలు నిజమైతే ప్రభుత్వం లో ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే ఆ లీజు ను రద్దు చేయాలి. TOT (టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) లీజును రద్దు చేసి…తాజాగా కొత్త బిడ్‌లను పిలవాలని సవాల్ చేస్తున్నా. తమ చేతిలో ఉన్న పని చేయకుండా ఊరికే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తే ప్రజలు కచ్చితంగా మీరు చేసే ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని గ్రహిస్తారు.
Also Read-
ఓఆర్ఆర్ లీజు విషయంలో మేము NHAI నిబంధనలను అనుసరించాం. ఈ లీజు విషయంలో తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే అది ఎంతో కాలం సాగదు