తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,
కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేసుకోవాలని గత నెల రోజులుగా కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం. కామారెడ్డి లో రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుంది.
అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. మాస్టార్ ప్లాన్ లో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడం వల్ల కొద్దిగా భూములు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం.
గ్రామ సభలు పెట్టి రైతులతో చర్చించకుండా అధికారులు రైతుల అభిప్రాయం సేకరించకుండా ఎలా అమలు చేస్తారు. రైతుల ఉద్యమం నెల రోజులుగా నడుస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునకు నిదర్శనం.
Related News:
రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రాణ సమానమైన భూములను కాపాడుకునేందుకు కలెక్టర్ తో చర్చించేందుకు వస్తే కలెక్టర్ కనీసం రైతులతో మాట్లాడేందుకు నిరాకరించడం ప్రజల పట్ల ఈ పాలకులకు ఉన్న నియంత ధోరణికి పరాకాష్ట.
ఈ విశయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలి. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రైతుల ముందు పెట్టి ప్రజా సభ లలో చర్చించి ప్రజల మద్దతుతోనే అమలు చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. కలెక్టరేట్ల వద్ద జరిగిన రైతు, పోకిసులకు మధ్య ఘర్షణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ
మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ మూర్ఖ వైఖరికి ఒక రైతు బలి కావడం బాధాకరం. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన రైతు పయ్యావుల రాములు ది ఆత్మహత్య కాదు, అది ప్రభుత్వ హత్య. నిన్న రైతు మృతదేహం తరలింపు విషయం లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
ఈ టీఆరెస్ ప్రభుత్వం శాశ్వతమని జిల్లా కలెక్టర్, పోలీసులు భావించకూడదు. మీరు చట్టబద్ధంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు ఇవాళ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళితే పోలీసులు అడ్డుకోవడం అప్రజా స్వామీకం. బారికేడ్లు, కంచెవేసి రైతుల్ని అడ్డుకోవడం సిగ్గుచేటు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఉగ్రవాదులుగా, సంఘవిద్రోహ శక్తులు గా పరిగణిస్తోంది. ఈ ప్రభుత్వంలో సీఎం కు ఎవరినీ కలిసే తీరిక లేదు, కనీసం జిల్లా కలెక్టర్లకు కూడా రైతుల్ని కలిసే సమయం లేదా. పట్టణానికి మాస్టర్ ప్లాన్ అవసరం అనుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ భూములు, రాళ్లు రప్పల భూమిని సేకరించాలి, కానీ పంటలు పండే రైతుల వ్యవసాయ భూముల్ని లాక్కోవడం ఎంతవరకు సమంజసం.
వెంటనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర మంత్రులు రైతులతో చర్చలు జరపాలి. మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ విషయంలో రైతులతో చర్చించి అవసరమైన మార్పులు చేయాలి. మాస్టర్ ప్లాన్ అలైన్ మెంట్ మార్చకుండా ఇట్లాగే మూర్ఖంగానే ముందుకు వెళ్తే జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అని గుర్తు చేస్తున్నా. రైతులు చేపట్టబోయే ఆందోళనకు బీజేపీ మద్దతు కొనసాగుతుంది.