Goodbye: టెన్నిస్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సానియా

हैदराबाद: भारतीय टेनिस स्टार सानिया मिर्जा ने संन्यास की घोषणा कर दी है। सानिया ऑस्ट्रेलियन ओपन खेलने ऑस्ट्रेलिया पहुंचीं। फरवरी में ऑस्ट्रेलियन ओपन और दुबई ओपन के बाद टेनिस के बाद संन्यास लेने की घोषणा की है। उन्होंने खुलासा किया कि ये दोनों टूर्नामेंट उनके आखिरी होंगे। इस संबंध में ट्विटर पर तीन पेज का नोट जारी किया गया। इसमें सानिया टेनिस में अपने लंबे सफर और संघर्ष के बारे में वर्णन किया हैं।

హైదరాబాద్ : హైదరాబాద్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. ఈ మేరకు మూడు పేజీల నోట్‌ను ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఇందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించింది.

30 సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో మీర్జా తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్‌లో టెన్నిస్‌ కోర్టుకు వెళ్లానని, అక్కడ కోచ్‌ టెన్నిస్‌ ఎలా ఆడాలో వివరించిందినట్లు గుర్తు చేసుకుంది. ఆరేళ్ల వయసు నుంచే నా కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందన్న సానియా.. అన్ని సమయాల్లో తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్‌, ఫిజియో, మొత్తం టీం మద్దతు లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని పేర్కొంది. ప్రతి ఒక్కరితో కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానన్న సానియా.. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ ధన్యవాదాలు తెలిపింది.

సానియా మీర్జా తన కెరీర్‌లో 36 సంవత్సరాల వయసులో ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన అనా డానిలినాతో కలిసి గ్రాండ్‌స్లామ్‌లో ఆడనుంది. మోచేయి గాయం కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాదే రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. గాయం కారణం ఆస్ట్రేలియన్‌ ఓపైన్‌ నుంచి వైదలొగడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నది. సానియా కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్‌లను సాధించింది. ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణి నిలిచింది. అంతకు ముందు సింగిల్స్‌నూ సత్తాచాటింది. వరల్డ్‌ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. 2005లో యూఎస్‌ ఓపెన్స్‌లో నాల్గో రౌండ్‌కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X