हैदराबाद: तेलंगाना में लोगों ने नए साल का स्वागत किया। नए लक्ष्यों और पुराने साल की यादों के साथ नए साल में प्रवेश किया। युवक और वृद्ध सभी नये साल के जोश में डूब गये। सभी ने एक दूसरेको नववर्ष की शुभकामनाएं दी। हैदराबाद से लेकर कस्बों और गांवों में युवकों ने जमकर नया साल मनाया। 2022 को अलविदा और 2023 स्वागत किया।
హైదరాబాద్: కోటి ఆశలు మరుయే కొంగొత్త ఆశయాలతో తెలంగాణ ప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని తేడాలేకుండా ప్రజలంతా సంబురాల్లో మునిగిపోయారు. కొత్త ఏడాది అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రాజధాని మొదలు పట్టణాలు, పల్లెల్లో యువత కేరింతలు కొట్టారు. 2022కి వీడ్కోలు… 2023కి వెల్‌కమ్ చెబుతూ ఆనంద డోలికల్లో తేలిపోయారు.
‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేకలు వేస్తూ కేక్‌లు కట్‌చేసి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని నిండుమనసుతో ఆహ్వానించారు. మరోవైపు అర్ధరాత్రి నుంచే మహిళలు ఉత్సాహంగా ఇళ్ల ముందు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. జిల్లాలోనూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2023కు స్వాగతం పలుకుతూ హనుమకొండలోని పలు కాలేజీల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. కరీంనగర్ జిల్లాలోని అల్ఫోర్స్ కళాశాలలో విద్యార్థుల కేరింతలు కొట్టారు.
संबंधित खबर:
2023కి చిన్నాపెద్ద అట్టహాసంగా స్వాగతం పలికారు. కేక్‌లు కట్ చేసి నోరు తీపి చేసుకున్నారు. అలయ్ బలయ్‌తో శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. డిసెంబర్ 31 రాత్రి హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు కిక్కిరిసిపోయాయి. కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఖర్చయ్యాయి. అర్ధరాత్రి 12 దాటగానే యువత బైక్‌లతో రోడ్లపైకి వచ్చి న్యూ ఇయర్ విషెస్‌తో హోరెత్తించింది. మరోవైపు నూతన సంవత్సర వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి.