MLC కవిత కు ఈ డీ నోటీస్ ఇవ్వడం రాజకీయ కుట్ర

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం లో భాగంగానే MLC కవిత కు ఈ డీ నోటీస్ జారీ చేసిందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలను చైత్యవంతులను చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోవడానికి కేంద్రం ఈ డీ ద్వారా నోటీస్ ఇప్పించింది అని క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఈ డి ల నోటీస్ లతో కవిత గారు బెదిరిపొరని ఎన్ని వేధింపులకు గురిచేసిన ప్రజా క్షేత్రాన్ని వదలరని ఆయన అన్నారు. దేశాన్ని అడ్డికి పావుషేరులెక్క అమ్మెస్తు… అధానికి లక్షల కోట్ల లబ్ది చేకూర్చుతు ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న మోడీ కి అమిత్ షా కు ED CBI ఎందుకు నోటీస్ ఇచ్చి ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని వేధిస్తూ వారి వేధింపులను ప్రశ్నిస్తున్న కవితని టార్గెట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలు సహించరని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులపై బీజేపీ మోడీ ప్రభుత్వంపై మంత్రి వేముల ఫైర్…

“దేశంలో మోడీ అవినీతి పాలనను కేసిఆర్ ప్రశ్నిస్తున్నందునే ఆయన్ను ఢీకొనే సత్తాలేక వారి కుమార్తె ఎమ్మెల్సి కవితమ్మను ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈడి నోటీసుల పేరిట వేధిస్తున్నారు. ఇది నీచాతినీచమైన రాజకీయ కుట్ర. యావత్ దేశ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న కేసిఆర్ గారిపై కేంద్ర బీజేపీ మోడీ రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమే ఇవన్ని. కేసిఆర్ గారి బిడ్డను ఇబ్బంది పాలు చేసి కేసిఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని దురాలోచన చేస్తున్నది మోడీ సర్కార్ కానీ ఎన్ని కుట్రలు చేసినా కేసిఆర్ తలొగ్గరు. ఇట్లాంటి ఊకదంపుడు బెదిరింపులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం సాధించేవాడే కాదు. మేమంతా కేసిఆర్ కుటుంబ సభ్యులమే ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి మేం బెదిరే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమ బిడ్డలకు అరెస్టులు,జైళ్లు కొత్తేమీ కాదు. బరాబర్ నరేంద్ర మోడీ అవినీతి పాలనను ప్రజల్లో ఎండగడతాం. బీజేపీ మోడీ,అమిత్ షా ఎట్లా చెప్తే అట్లా వ్యవహరిస్తున్నాయి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈడి,సిబిఐ బిజెపికి తోబుట్టువులా పనిచేస్తున్నాయి. లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొడుతున్న మోడీ దోస్త్ అదానీ పై ఎలాంటి చర్యలు లేవు. మోడీ బినామీ అదానీ ఎల్ఐసి,ఎస్బిఐ లలో ప్రజలు దాచుకున్న సొమ్మును దోచుకున్నాడు. ఇందులో వేల కోట్ల కుంభ కోణం జరిగింది దమ్ముంటే దానిపై ఈడి,సిబిఐ కేసులు పెట్టి దర్యాప్తు జరపాలి. దేశ ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ మోడీ గద్దె దిగేవరకు మా పోరాటం ఆగదు. ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీ మోడీకి తెలంగాణ ఆడపడుచుల ఉసురు తగులుతుంది.”

శాసనమండలి సభ్యురాలు కలువకుంట్ల కవిత కు ఇడి ఇచ్చిన నోటీసులపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

“కేంద్రప్రభుత్వం దుర్మార్గాలకు పరాకాష్ట. బిజెపి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఇచ్చిన నోటీసులు కావు. రాజకీయ దురుద్ధేశం తోటే కవిత కు నోటుసులు. ఢిల్లీలో ఆప్ ,ఇక్కడ బి ఆర్ యస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె కుట్రలో భాగమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే. ఇటువంటి పప్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఉడకవు. నియంతలు ఎప్పుడూ నిలబడ లేదు. బి ఆర్ యస్ ను నిలువరించగలం అనుకుంటున్న వారిది మూర్ఖత్వం. మోడీ దుర్మార్గాలకు కాలం చెల్లింది. బిజెపి సర్కార్ ను గద్దె దింపే వరకు పోరాటం. కేసులు,జైళ్లు మాకు కొత్త కాదు. ప్రజల కోసం పనిచేసేవారికి ఇవి తప్పవు. 2001 లో రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలు పెట్టిన రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఇదే”

సంజయ్ సింగ్, ఆప్ రాజ్యసభ సభ్యులు

“ప్రశ్నించిన వాళ్ళపట్ల బిజెపి సర్కార్ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం విపక్షాలను వేధించాలనే ఉద్దేశ్యంతో కూడినవే. మహిళల హక్కుల కోసం 10వ తేదీన దీక్ష చేస్తున్నదనే ఉద్దేశ్యంతోనే నేడు ఈడీ నోటీసులు ఇచ్చారు. విపక్షాలను రూపుమాపేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు తెచ్చుకోండి. ఈడీ, సీబీఐలకు బడ్జెట్ పెంచండి గల్లీ గల్లీకి బ్రాంచ్ ఓపెన్ చేసి విపక్షాలను అరెస్ట్ చేయండి. శవాలను కూడా విచారించే నియమాలు తీసుకురండి. విద్య, వైద్యం, కరెంటు, అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ బిజెపి ప్రభుత్వానికి అవసరం లేదు.”

Press state ment issued by Gadwal Vijaya Laxmi, Mayor ,Greater Hyderabad

“కవితకు ఈడి నోటీసు ఇవ్వడం ఒక కక్ష సాధింపు చర్య. ఇది ఒక దుర్మార్గపు చర్య. లిక్కర్ స్కాం పేరిట బీజేపీ నాటకాలు ఆడుతోంది. ..మోడీ విధానాలు ఎమర్జెన్సీ కన్నా దారుణం గా ఉన్నాయి. బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రతి పక్షాలను వేధించేందుకు వాడుకోవడం సిగ్గు చేటు. ఈ డ్రామా ను ప్రజలు తిప్పి కొట్టాలి. కవిత బీ ఆర్ ఎస్ పార్టీ విస్తరణ లో క్రియాశీలంగా ఉన్నందుకే బీజేపీ కక్ష కట్టింది. నేతలు విచారణ కు సహకరిస్తుంటే ఈ నోటీసులు, బెదిరింపులు అరెస్టులు దేనికి ..సీబీఐ, ed ల విచారణ తీరు సరిగా లేదు. తప్పుడు కేసులు బనాయిస్తున్న బీజేపీ కి తెలంగాణ తగిన గుణపాఠం చెబుతుంది. కవితకు అందరూ అండగా ఉంటారు’ ఢిల్లీలో మహిళ హక్కుల రక్షణకు, రిజర్వేషన్ల కై ఉద్యమిస్తున్న సమయంలో ఇటువంటి చర్యలు దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పారదర్శక పద్దతిలో విచారణ చేపట్టి ప్రతిపక్ష నేతలను వేధించడం మానాలి.”

ఈడీ, సీబీఐ, ఐటీ కేంద్రం చేతులో కీలుబొమ్మ‌లు.

సీబీఐ- ఈడీ వంటి వ్య‌వ‌స్థ‌ల‌ను బీజేపీ భ్ర‌ష్టు ప‌ట్టిస్తుంది

అధికార దుర్వినియోగంతో బీజేపీ ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతుంది

సీయం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్సీ క‌విత‌ను టార్గెట్ చేశారు

తెలంగాణ‌లో బీజేపీ ఆట‌లు సాగ‌వు

సీయం కేసీఆర్ ఎవ‌రికీ త‌ల‌వంచె ర‌కం కాదు: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ : ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌లు కేంద్రం చేతులో కీలుబొమ్మ‌లుగా మారాయని అట‌వీ,ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ క‌విత‌కు ఈ డీ నోటీసులపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్పందించారు. నిర్మ‌ల్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థల్ని బీజేపీ కేంద్ర‌ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్ర‌తిపక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిప‌డ్డారు. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని ద్వ‌జ‌మెత్తారు.

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కోరుతూ ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని నిర్ణయించార‌ని, ఈ నేప‌థ్యంలోనే నోటీసులు జారీ చేయ‌డం బీజేపీ క‌క్ష్య‌సాధింపు రాజ‌కీయాల‌కు ఇది నిద‌ర్శన‌మ‌న్నారు. తెలంగాణ‌లో బీజేపీ ఆట‌లు సాగ‌వని, సీయం కేసీఆర్ ఎవ‌రికీ త‌ల‌వంచె ర‌కం కాదని స్ప‌ష్టం చేశారు. సీయం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్సీ క‌విత‌ను టార్గెట్ చేశారు. బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేఖ విధానాల‌ను బీఆర్ఎస్ పార్టీ ఎండ‌గ‌డుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం ప్ర‌తిప‌క్షాల నాయ‌కుల‌ను టార్గెట్ గా చేసుకుని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌చే దాడులు చేపిస్తుంద‌ని, మ‌రి బీజేపీ నేత‌ల‌పై ఎందుకు దాడులు చేయ‌డం లేద‌ని, వారంద‌రూ నీతిమంతులేనా అని ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X