ఎన్నికల విధుల్లో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ తప్పని సరిగా వినియోగించుకోవాలి: రోనాల్డ్ రోస్

హైదరాబాద్ : ఎన్నికల విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో హైదరాబాద్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల  విధులు నిర్వహించే అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి పోస్టల్  బ్యాలెట్ అందజేయడం, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు,ఫెసిలిటేషన్ సెంటర్ ల ఏర్పాటు, తదితర అంశాలపై దిశా, నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల  విధులు నిర్వహించే  సిబ్బందికి తమ ఓటు హక్కు వినియోగించు కోవడానికి ఎన్నికల కమిషన్  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసేలా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రక్రియ పకడ్బందీగా ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఎన్నికల కమిషన్ సూచనల మేరకు  అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
 
ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలోనే ఫారం – 12 అందించి, పోస్టల్ బ్యాలెట్ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అన్ని వివరాలతో దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు  ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటింగ్ వేసే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు అన్ని ఏర్పాట్లను వేగవంతంగా  పూర్తిచేయాలన్నారు.
 
 ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకుని జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడంలో భాగస్వాములు అయ్యేలా చైతన్య పరచాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే వారు తమ ఎపిక్ కార్డు తో పాటు పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ కూడా  శిక్షణ తరగతుల హాజరయ్యే సందర్భంలో తీసుకొని వచ్చే విధంగా  మెసేజ్ పంపించాలని లేదా ఓటరు జాబితాలో పేరు ఉందో  లేదో సరి చూసుకోవాలని సూచించారు. 

ఎలక్షన్ కమిషన్ సూచించిన ఎమర్జెన్సీ సర్వీస్ శాఖల కు నోడల్ ఆఫీసర్ నియామకం చేయుటకు తగు లేఖ వ్రాసి నోడల్  అధికారుల వివరాలను పంపించు టకు తగు చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ అడిషనల్ కమిషనర్ ను జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.

ఎన్నికల విధులు నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిన వారు శిక్షణ కు గైర్హాజరు అయిన పక్షంలో వారి పై  క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ తో పాటు ఎఫ్ ఐ అర్ కూడా నమోదు చేయుటకు వెనుకాడవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే, జిహెచ్ఎంసి ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, ఏ.ఆర్.ఓ లు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X