हैदराबाद: देश में हो रहे ट्रेन हादसों का सिलसिला गंभीर चिंता का कारण बनता जा रहा है। हाल ही में ओडिशा ट्रेन दुर्घटना और तेलंगाना में फलकनुमा एक्सप्रेस में आग लगने की घटनाओं को लोग भूले भी नहीं है। शुक्रवार को एक और ट्रेन दुर्घटना हो गई है। महाराष्ट्र में शनिवार सुबह तेलंगाना एक्सप्रेस ट्रेन में आग लग गई। महाराष्ट्र के नागपुर के पास तेलंगाना एक्सप्रेस की एस-2 बोगी में आग लग गई।
यात्रियों से सूचना मिलने के बाद रेलवे स्टाफ ने ट्रेन को नागपुर के पास रोक दिया। सहायता दल तुरंत मौके पर पहुंचे और बोगी में लगी आग पर काबू पाया। ट्रेन रुकते ही बड़े पैमाने पर आग लगने से घबराए यात्री डर के मारे भाग खड़े हुए। इस हादसे में कोई जनहानि नहीं होने पर अधिकारियों और यात्रियों ने राहत की सांस ली। हालांकि, इस घटना की पूरी जानकारी अभी तक नहीं मिल पाई है।
Big Breaking: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం, S-2 బోగీలో చెలరేగిన మంటలు
హైదరాబాద్: దేశంలో చోటు చేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒడిషా రైలు యాక్సిడెంట్, తెలంగాణలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనలను పూర్తిగా మరువక ముందే.. తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజూమున మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రయాణికుల నుండి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నాగ్‌పూర్ సమీపంలో నిలిపివేశారు. సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బోగీలోని మంటలను అదుపు చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు ట్రైన్ ఆగిన వెంటనే భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)