हैदराबाद : सिकंदराबाद के स्वप्नलोक कॉम्प्लेक्स में भीषण आग लग गई। इस घटना में छह लोगों की मौत हो गई। मरने वालों में चार महिलाएं और दो पुरुष हैं। इसअग्निकांड ने कई परिवारों को दुख से भर दिया है। इस घटना में मरने वालों की पहचान प्रमिला, वेन्नेला, श्रावणी, त्रिवेणी, शिवा और प्रशांत के रूप में की गई। खासकर संयुक्त वरंगल जिले में मातम छा गया है।
मृतकों में पांच लोग संयुक्त वरंगल जिले के रहने वाले हैं। नरसमपेटा मंडल के चंद्रय्यापल्ली के उप्पल शिवा, खानापुरम मंडल केंद्र के बनोत श्रावणी (22) और दुगोंडी मंडल के मरीपल्ली गांव के वंगा वेनेला की मौत हो गई। इस हादसे में महबूबाबाद जिलेके गुडुरु मंडल के सुरेश नगर गांव की के. प्रमिला (22) और केसमुद्रम मंडल इंटिकन्ने गांव के अमराजू प्रशांत (23) की भी मौत हो गई। दो युवकों और तीन युवतियों की मौत से उनके गृहनगर में मातम पसर गया।
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం… వరంగల్ జిల్లాలో విషాదం
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఒక్క అగ్ని ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల్లో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఉన్నారు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి చెందిన ఉప్పుల శివ, ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోత్ శ్రావణి(22), దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సురేష్ నగర్ గ్రామానికి చెందిన కె.ప్రమీల (22), కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమరాజు ప్రశాంత్ (23) కూడా ఇదే ప్రమాదంలో మృతిచెందారు. ఇద్దరు యువకులు, ముగ్గురు యువతుల మృతితో వారి వారి స్వగ్రామాల్లో విషాదం నెలకొంది. (ఏజెన్సీలు)
మంటలు వ్యాపించిన నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లో మొత్తం ప్రైవేట్ కార్యాలయాలున్నాయి. మంటల వ్యాప్తికి పలువురు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు. మంటల తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. సహాయ చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఉన్న ఏడుగురిని కాపాడారు.
స్రృహ తప్పిపోయిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. నాలుగు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. (ఏజెన్సీలు)