EVM Damage Case : अग्रिम जमानत के लिए विधायक पिन्नेल्ली की आंध्र प्रदेश उच्च न्यायालय में याचिका

हैदराबाद: माचर्ला विधायक पिन्नेल्ली रामकृष्ण रेड्डी ने मतदान केंद्र पर ईवीएम में तोड़फोड़ के मामले में अग्रिम जमानत की मांग करते हुए आंध्र प्रदेश उच्च न्यायालय में याचिका दायर की है। पीठ ने याचिका पर सुनवाई की इजाजत दे दी। इसके साथ ही पिन्नेल्ली रामकृष्ण रेड्डी के वकील बेंच के सामने दलीलें दे रहे हैं।

ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్‌

హైదరాబాద్ : పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు అనుమతించింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తున్నారు.

సంబంధిత వార్త

కాగా ఏపీ ఎన్నికల వేళ మాచర్ల జిల్లాలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు బీభత్సం సృష్టించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం మిషిన్లను ధ్వంసం చేశారు. పోలింగ్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈవీఎంలు ధ్వంసం చేసినందుకు పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారయ్యారు. పోలీసులకు చిక్కకుండా ఏపీ, తెలంగాణలో తిరుగుతున్నారు. దీంతో పిన్నెల్లిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అయితే తెలంగాణలోని సంగారెడ్డి వద్ద పిన్నెల్లి కారు డ్రైవర్ తోపాటు ఆయన గన్‌మెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పిన్నెల్లి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ లంచ్‌మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు అనుమతించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X