हैदराबाद: डॉ. बीआर अंबेडकर को कोनसीमा जिले (आंध्र प्रदेश) में भीषण सड़क दुर्घटना हुआ। आलमुरु मंडल के मडिकी राष्ट्रीय राजमार्ग पर वैन और कार की टक्कर हो गई। इस हादसे में वैन में सवार तीन और कार में सवार एक व्यक्ति की मौके पर ही मौत हो गई।
हादसे में नौ घायलों को इलाज के लिए राजमंड्री सरकारी अस्पताल में भर्ती किया गया। जानकारी मिलते ही पुलिस तुरंत घटनास्थल पर पहुंची और राहत व बचाव कार्य में जुट गई। साथ ही यातायात को नियंत्रित करने के लिए आवश्यक कदम उठाया।
मिली जानकारी के अनुसार, अनकापल्ली के चोडवरम गांव निवासी नौ लोग टाटा मैजिक वैन में कोत्तापेट मंडल के मदनपल्ली भगवान के दर्शन के लिए जा रहे थे। इसी क्रम में विशाखापट्टणम की ओर से आ रही कार अनियंत्रित होकर वैन से टकरा गई। दुर्घटना की वजह अधिक रफ्तरा बताई जा रही है। पुलिस ने मामला दर्ज कर लिया है और हादसे की जांच कर रही है।
यह भी पढ़ें:
రోడ్డు ప్రమాదం: జాతీయ రహదారిపై వ్యాను, కారు ఢీ, నలుగురు మృతి
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (ఆంధ్రప్రదేశ్) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు మండల పరిధిలోని మడికి నేషనల్ హైవేపై వ్యాన్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఒక్కరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
గాయపడిన మరో 9 మందిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు అలాగే హైవే కావడంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు.
అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్‌లో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో విశాఖ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొంది. వేగం కూడా కారణమని చెబుతున్నారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)