డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొత్త లోగో ఆవిష్కరణ, ఎందుకంటే…

ప్రవేశ నోటిఫికేషన్ల సమాన అవకాశాల విధానం, విశ్వవిద్యాలయ లెటరల్ ఎంట్రీ విధానం పోస్టర్లు విడుదల

హైదరాబాద్ : చదువుపై శ్రద్ధ ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని తెలంగాణ కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ ఎ. శ్రీదేవసేన పేర్కొన్నారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ శుక్రవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో “ప్రాంతీయ కేంద్రాల పరిపాలన, విశ్వవిద్యాలయ నైపుణ్య ప్రణాళికలు” అనే అంశంపై ఒక రోజు దిశానిర్దేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ ఎ. శ్రీదేవసేన హాజరయ్యారు.

శ్రీదేవసేన మాట్లాడుతూ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఒక ప్రజ్ఞ విశ్వవిద్యాలయం అని అన్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో లోని విధ్యార్థులలో కొందరికి హృదయ విషాదకరమైన కథ ఉంటుందని అన్నారు. విద్యకు దూరమైన వ్యక్తులను గుర్తించి, మెరుగైన సౌకర్యాలతో విద్యావకాశాలను కొనసాగించాలని కోరారు. కళాశాలలో పని చేసే విద్యావంతులు ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్యను అందించడానికి కంకణం కట్టుకోవాలని సూచించారు. అనంతరం వర్సిటి కొత్త లోగో ను , ప్రవేశ నోటిఫికేషన్ల సమాన అవకాశాల విధానం, విశ్వవిద్యాలయ లెటరల్ ఎంట్రీ విధానం పోస్టర్లను ఆవిష్కరించారు.

కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం (విభజన) విశ్వవిద్యాలయం కొత్త లోగోను రుపొందించమని అన్నారు. తక్కువ ఫీజులతో మెరుగైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. పుస్తకాలు, ఆడియో వీడియో పాఠాలు, కౌన్సిలింగ్ క్లాసులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సామజిక సేవ దృక్పథంతో విద్యను విస్తరిస్తున్నామని తెలిపారు. 24 గంటల విద్యా చానల్ ను తీసురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.

Also Read-

సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రవేశాలపై స్థానికంగా విద్యార్థులకు అవగాహనా కల్పించాలని కోర్దినేటర్లను కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని మహిళల్లో ఆవిష్కరణ, నాయకత్వాన్ని పెంపొందించడం ద్వారా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది సామాజిక సాధికారతను ప్రభావితం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేయుతనిస్తోందని చెప్పారు. ఉపాధి నైపుణ్యాలను పెంపొందించి, మహిళా అభ్యాసకులను శక్తివంతం చేయడానికి వీ-హబ్ తో అవగాహనా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RASCI)తో కలిసి స్టైపెండ్ ఆధారిత అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ (SAP)ను కూడా ప్రారంభించమని పేర్కొన్నారు. వారంలో కనీసం 3 రోజులు పనిచేసినందుకు విద్యార్థికి నెలకు కనీసం రూ.7,000 నుండి గరిష్టంగా రూ. 24,000 వరకు లభిస్తుందని వివరించారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి; విద్యార్థి సేవ విభాగ డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు; డా. ఎ. రమాదేవి, డైరెక్టర్లు, శాఖల అధిపతులు, డీన్‌లు, బోధన మరియు బోధనేతర సిబ్బంది సభ్యులు మరియు వివిధ సేవా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X