हैदराबाद : ज्ञात हो कि 5 जून की शाम को शहर में आए तूफानी बारिश के कारण मेट्रो ट्रेन सेवाएं बाधित हो गईं थीं। इसके चलते मियापुर-एलबीनगर रूट पर रेल यातायात रोक दिया गया। लोको पायलटों ने बताया कि तकनीकी कारणों से ट्रेन को रोका गया। 10 मिनट बाद मेट्रो ट्रेन सेवाएं फिर से शुरू हो गईं।
इस बीच अपने गंतव्य पर पहुंचे यात्रियों को अजीब अनुभव हुआ। स्टेशनों पर बहुत अधिक समय बिताने के लिए उन पर जुर्माना लगाया गया। उन्होंने प्रत्येक व्यक्ति से जबरन 15 रुपये वसूल किया। यह मामला तब सामने आया जब एक यात्री ने जुर्माने की रसीद सोशल मीडिया पर पोस्ट कर दी।
अपने पोस्ट में यात्री ने सवाल किया कि अगर तकनीकी खराबी के कारण ट्रेन रुकती है तो जुर्माना हम क्यों दें। शिकायतों की आई बाढ़ के चलते मेट्रो रेल प्रबंधन ने माफी मांगी है। साथ ही कहा गया है कि “अधिक समय तक रुकने” के लिए यात्रियों पर लगाया गया शुल्क वापस कर दिया गया है। हालाँकि, कितने यात्रियों से शुल्क लिया गया? यह बताने से इनकार कर दिया कि कितनों को प्रतिपूर्ति की गई।
మెట్రో రైలు రాకపోకల్లో అంతరాయం, ప్రయాణికులకు జరిమానా, యాజమాన్యం క్షమాపణ
హైదరాబాద్ : జూన్ 05 సాయంత్రం నగరంలో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతోనే నిలిపివేసినట్టు లోకో పైలట్లు తెలిపారు. తిరిగి 10 నిమిషాల అనంతరం మెట్రో రైలు సర్వీసులు పునఃప్రారంభమైనవి.
Also Read-
కాగా గమ్యస్థానాలకు చేరుకున్న ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. స్టేషన్లలో ఎక్కువ సేపు ఉండి కాలక్షేపం చేశారని జరిమానా విధించారు. ఒక్కొక్కరి నుంచి బలవంతంగా రూ.15 చొప్పున వసూలు చేశారు. ఒక ప్రయాణికుడు తాను చెల్లించిన జరిమానా రసీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సాంకేతిక లోపంతో రైలు ఆగిపోతే, జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రయాణికుడు తన పోస్టులో ప్రశ్నించాడు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెట్రో రైల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. “ఓవర్‌స్టేనింగ్”పై ప్రయాణికులకు విధించిన ఛార్జీలను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అయితే, ఎంత మంది ప్రయాణికులపై ఛార్జీ విధించారు..? ఎంతమందికి తిరిగి చెల్లించారు అనే వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. (ఏజెన్సీలు)