हैदराबाद: देश भर में सनसनी मचाने वाला दिल्ली शराब घोटाला दिन पर दिन करवट बदलता जा रहा है। इस मामले में पहले ही कई नेताओं और कारोबारियों के नाम शामिल कर चुकी ईडी ने हाल ही में चार्जशीट में कुछ और नाम जोड़े हैं। कुल 17 लोगों को आरोपित किया गया है। इस बार चार्जशीट में एक साथ दिल्ली के एक मुख्यमंत्री का नाम दर्ज होना बवाल मचा है।
ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ ఛార్జ్ షీట్‌లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ, వ్యాపారుల పేర్లను చేర్చిన ఈడీ.. తాజాగా మరికొందరి పేర్లను ఛార్జ్‌షీట్‌లో మరికొందరి పేర్లను చేర్చింది. మెుత్తం 17 మందిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ సారి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఛార్జ్‌షీట్‌లో నమోదు చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది.
రెండో చార్జీషీట్‌ను ఫైల్ చేసిన అధికారులు ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.
ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్‌తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. మెుత్తం 428 పేజీలతో కూడిన రెండో చార్జీషీట్‌ను ఈడీ విడుదల చేసింది. అయితే.. కీలకమైన ఈ కేసులో ఏకంగా ఓ రాష్ట్ర సీఎం పేరును ప్రస్తావించడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.
అయితే ఈడీ ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయటం లేదని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వాలను కూల్చటానికే ఈడీ పని చేస్తోందని విరుచుకుపడ్డారు. ఈడీ 5 వేలకు పైగా ఛార్జ్‌షీట్లు నమోదు చేసిందని అందులో ఎంత మందికి శిక్షపడిందని ప్రశ్నించారు. డిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్‌షీట్ మెుత్తం కల్పితమని కేజ్రీవాల్ అన్నారు.
ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుంటున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. ఇందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,ఎమ్మెల్సీ కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా 17 మంది పేర్లను ప్రస్తావించింది. లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత 10 సెల్ ఫోన్లు మార్చినట్లు ఈడీ ఛార్జ్ షీటులో ఆరోపించింది. సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారిలో కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూపు నుంచి రూ.100కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించామని స్పష్టం చేసింది. సమీర్ మహేంద్ర నుంచి విజయ్ నాయర్ భారీగా ముడుపులు అందుకోవడంతో పాటు కవిత సన్నిహితుడైన అరుణ్ పిళ్లై సైతం భారీగా ప్రయోజనం పొందిన విషయాన్ని ప్రస్తావించింది.
లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో ఫేస్ టైం వీడియోకాల్ ద్వారా సమీర్ మహేంద్రుతో మాట్లాడించినట్లు ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొంది. ఈ లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడుకుందని ఆరో పించింది.
లిక్కర్ లైసెన్సులు ఇప్పించేందుకుగానూ ఆప్ నాయకుల తరఫున విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఈడీ చెబుతోంది. సౌత్ గ్రూపులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి ఉన్నారని వారి ప్రతినిధులుగా అభిషేక్ బోయిన్ పల్లి, రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఛార్జ్ షీటులో స్పష్టం చేసింది. (ఏజెన్సీలు)