హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జెఏసి కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం డా బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని డా బి ఆర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని, ఆలోపు యూజీసీ పే స్కేల్ (బేసిక్, డిఎ, హెచ్ఆర్ఎ, 3 శాతం ఇంక్రిమెంట్) తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడ చదవండి-
అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘము అధ్యక్షుడు డా. కె. అవినాష్, ప్రధాన కార్యదర్శి డా. ఎం. కిషోర్, సలహాదారులు డా. నర్సింలు, డా. విజయ్, ఉపాధ్యక్షులు కె. ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి డా. పి. రాధాకృష్ణ, కోశాధికారి డా. వై. కుమార్, ఈసి సభ్యులు డా. మఖ్డోం మోయుదుద్దిన్ , డా. రామకృష్ణ, కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.
