हैदराबाद : सीएम रेवंत रेड्डी ने बीआरएस नेताओं पर सनसनीखेज टिप्पणी की है। मंगलवार को रंगारेड्डी जिले के चेवेल्ला में ‘जन जातरा’ नाम से एक जनसभा आयोजित की गई। इस जनसभा में शामिल हुए सीएम रेवंत रेड्डी ने कहा कि वह अपने दादा और पिता का नाम लेकर यहां तक नहीं आया हैं। बल्कि भ्रष्ट और दुष्ट तरह से काम करने वालों को रौंदकर यहां तक आया है।
रेवंत रेड्डी ने मास चेतावनी देते हुए कहा कि तेलंगाना को लूटने वाले किसी को भी नहीं छोड़ा जाएगा। तेलंगाना के लोगों ने पहले ही लूटने वालों को सबक सिखाया है। उन्होंने चौंकाने वाली टिप्पणियाँ कीं कि अब हमें लूट चुके संपत्ति का हिस्सा देना होगा। उन्होंने कांग्रेसियों को सुझाव दिया कि सरकार गिराएंगे कहने वालों को लातों से मारों। इस मौके पर सीएम रेवंत रेड्डी ने केसीआर और केटीआर को चुनौती दी और कहा कि संसदीय चुनाव में कम से कम एक सीट जीतकर दिखाये। देखेंगे कि केसीआर आएंगे या केटीआर आते हैं।
मुख्यमंत्री ने कहा कि कांग्रेस सरकार जनता के चाहने पर सत्ता में आई सरकार है। उन्होंने कहा कि 500 रुपये में महिलाओं पर गैस सिलेंडर दे रहे हैं, ताकि राज्य की महिलाओं की आंखों में आंसू न आये। याद दिलाया कि उस समय की यूपीए सरकार महिलाओं को लकड़ी के चूल्हे से मुक्ति दिलाना चाहती है। देश के सभी गरीबों को मात्र 1500 रुपये में लोगों को गैस कनेक्शन दिया गया। तेलंगाना में गैस सिलेंडर योजना के लिए 40 लाख लोगों की पहचान की जा चुकी है। यदि किसी को योजना नहीं मिलती है तो उन्हें मंडल कार्यालय जाकर आवेदन करने की सलाह दी है।
అవినీతి పరులను, దుర్మార్గులను తొక్కుకుంటూ పైకొచ్చా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ‘జన జాతర’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను తాత, తండ్రి పేరు చెప్పుకొని పైకి రాలేదని అవినీతి పరులను, దుర్మార్గులను తొక్కుకుంటూ పైకొచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను దోచుకున్న ఎవరినీ వదిలిపెట్టబోను అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రాన్ని దోచుకున్న వారికి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారు. ఇక మా వాటా ఇవ్వాల్సి ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవరైనా అంటే తన్నండి అని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలిపించి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారో తాము చూస్తామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కోరుకుంటే వచ్చిన ప్రభుత్వమని అన్నారు. రాష్ట్ర మహిళల కళ్లల్లో నీళ్లు రావొద్దని 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని అన్నారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కలిగించాలనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం భావించిందని గుర్తుచేశారు. కేవలం 1500 లకే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ పథకానికి ఇప్పటికే 40 లక్షల మందిని గుర్తించామని అన్నారు. ఎవరికైనా పథకం అందకపోతే మండల కార్యాలయానికి వెళ్లి పేర్లు రాయించుకోవాలని సూచించారు. (ఏజెన్సీలు)