Hyderabad: మహహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా కేంద్రానికి సమీపంలో పాలకొండ వద్ద నిర్మించిన సమీతకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చాంబర్‌లో కలెక్టర్ వెంకట్రావ్‌ను సీట్‌లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు.
సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. శంషాబాద్, షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్లలో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి ప్రగతిభవన్ కు చేరుకుంటారు.