हैदराबाद: तेलंगाना सरकार ने एक और महत्वपूर्ण फैसला लिया है। ज्ञातव्य है कि तेलंगाना में 25 दिनों से अधिक समय तक बड़े पैमाने पर घरेलू सर्वेक्षण किया गया। इस सर्वेक्षण के साथ-साथ जाति जनगणना भी कराई गई। इसके बाद मुख्यमंत्री रेवंत रेड्डी ने विधानसभा की विशेष सत्र में राज्य में विभिन्न जातियों की जनसंख्या का ब्यौरा पेश किया।
हालांकि, कांग्रेस सरकार ने जाति जनगणना सर्वेक्षण को लेकर विपक्षी दलों द्वारा लगाए गए आरोपों को गंभीरता से लिया है। अब यह भी घोषणा की गई है कि जाति जनगणना सर्वेक्षण में भाग नहीं लेने वालों के लिए एक बार फिर से सर्वेक्षण कराया जाएगा। इसी क्रम में 16 से 28 फरवरी तक दस दिन तक एक बार फिर जाति जनगणना सर्वेक्षण किया जाएगा।

तेलंगाना के उपमुख्यमंत्री भट्टी विक्रमार्क ने बताया कि यह निर्णय तेलंगाना की 3.1 प्रतिशत आबादी को राज्य की जनगणना में शामिल करने के लिए लिया जा रहा है, क्योंकि ये सर्वेक्षण में भाग नहीं लिया था। उपमुख्यमंत्री ने बुधवार शाम को मीडिया को बताया गया कि तेलंगाना में व्यापक घरेलू सर्वेक्षण में भाग नहीं लेने वाले 3.1 प्रतिशत लोगों के लिए पुनः सर्वेक्षण किया जा रहा है।
Also Read-

తెలంగాణో మరోసారి కులగణన
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25 రోజులకు పైగా ఇదివరకే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ సర్వేతోపాటు కులగణన కూడా జరిపి. రాష్ట్రంలో ఉన్న వివిధ కులాలకు చెందిన జనాభాను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రవేశ పెట్టారు.
అయితే కులగణన సర్వేపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీరియస్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన సర్వేలో పాల్గొనని వారికోసం మరోసారి రీసర్వే చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు పదిరోజులపాటు మరోసారి కులగణన చేపట్టనున్నారు.
తెలంగాణ జనాభాలో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని వీరిని కూడా రాష్ట్ర జనాభా లెక్కల్లోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొననని 3.1 శాతం మంది కోసం రీసర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు.
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వంటి వాళ్లు కొందరు ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదని ఫైర్ అయ్యారు. ఇక, ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తాం. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపి వాళ్లపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కలిసి వచ్చే రాజకీయ పార్టీలను తీసుకొని ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తామన్నారు.(ఏజెన్సీలు)